ట్రంప్ ఖాతాలోకి మరో రాష్ట్రం చేరింది.. ఇప్పుడేం జరుగుతుంది?
అదేంటి.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయిపోయాయిగా? అనుకొని ఉంటే తప్పులో కాలేసినట్లే. అధ్యక్ష స్థానాన్ని చేప్టేందుకు 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సొంతం చేసుకుంటే.. మిగిలిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురించి పెద్దగా ఫోకస్ పెట్టరు. ఇప్పుడు జరిగింది కూడా అదే. అమెరికాలోని మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 538. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల లెక్క చూస్తే.. డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ కు 284 ఓట్లను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే విజేతగా నిలిచారు. ఇక.. ట్రంప్ విషయానికి వస్తే ఆయనకు వచ్చిన మొత్తం ఎలక్టోరల్ ఓట్లు 214. వీరిద్దరికి వచ్చిన ఓట్లను కలిపితే.. 498. అలస్కాలో మూడు ట్రంప్ ఖాతాలో పడ్డాయి. దీంతో ఆయన బలం 217కు పెరిగింది. ఇంకా ఫలితం తేలాల్సిన సీట్లు 37 వరకున్నాయి.
అయితే.. వీటి ఫలితం ఎలా వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. బైడెన్ కు కావాల్సిన మెజార్టీ రావటమే కారణం. ఇప్పుడు ప్రకటించే సీట్లతో పెద్దగా పనేమి ఉండదు. లెక్కకు పనికి వస్తాయో తప్పించి.. అవేమీ తుది ఫలితం మీద ఎలాంటి ప్రభావానన చూపించదు. తాజాగా ట్రంప్ ఖాతాలోకి అలస్కా వచ్చి చేరింది. ఈ రాష్ట్రంలో కేవలం మూడు స్థానాలు ఉండటం.. అవి కాస్తా రిపబ్లికన్లకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఇంకా ఫలితాలు వెలువడాల్సిన రాష్ట్రాలు ఉన్నాయి. అవి లెక్కలోకి రావటం తప్పించి.. మరెలాంటిటి ప్రయోజనం.. ప్రభావం చూపించే అవకాశం లేదు.
తాజాగా అలస్కాలో గెలవటంతో తమకున్న బలాన్ని పెంచుకోవటం ఓ పక్క.. మరో వైపు సెనెట్ లో ఒక సీటు మద్దతును సొంతం చేసుకునే అవకాశం లభించింది. ఈ రాష్ట్రంలో ట్రంప్ 56.9 శాతం ఓట్లను సొంతం చేసుకుంటే.. బైడెన్ 39.1 శాతం ఓట్లను పొందగలిగారు. సెనేట్ లో రిపబ్లికన్ల బలం 50కు పెరిగింది.
గెలిచిన తర్వాత కూడా బైడెన్ చికాకుల్ని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ పుణ్యమా అని.. అధికార మార్పిడి అంత సులువుగా సాగని పరిస్థితి. ఓట్ల లెక్కింపు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే ట్రంప్ వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయటం తెలిసిందే. ఓటమిని అంగీకరించకపోవటం సరికాదని బైడెన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 20న బైడెన్ అమెరికా దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ లోపు మరెన్ని మలుపులకు ట్రంప్ కారణమవుతారో?