• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భాగ్యనగరంలో మరో భారీ మోసం...

భాగ్యనగరంలో మరో భారీ మోసం .. 24 లక్షల టోకరా !

By - Tupaki Desk
Update: 2021-11-09 07:37 GMT
పోలీసులు సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెపుతున్నా హైదరాబాద్ నగర ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. అయితే , కార్డు డీటెయిల్స్, సీవీవీ నంబర్, పాస్ వర్డ్ లాంటివి ఎవ్వరికీ చెప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకుంటున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, మరోవైపు ఏదో ఒక రూపంలో ఆన్ లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఇలానే ఆన్ లైన్ మోసానికి గురైంది. ఏకంగా 24 లక్షల రూపాయలు పోగొట్టుకుంది.

చందానగర్ ప్రాంతంలో ఉండే బాధితురాలు స్థానికంగా ఉంటూ రకరకాల వ్యాపారాలు చేస్తోంది. ఆమె కు ఆన్ లైన్ లావాదేవీలపై అవగాహన ఉంది. పరిమిత లావాదేవీలు జరిగేలా ఖాతాకు లిమిట్ కూడా పెట్టుకుంది. అయినప్పటికీ ఆమె లక్షల్లో డబ్బు కోల్పోయింది. కారణం సిమ్ క్లోనింగ్. బాధితురాలి మొబైల్ కు ఎస్ఎంఎస్ లేదా ఇతర మార్గాల ద్వారా మాల్ వేర్ ను పంపించారు. అది ఆమె క్లిక్ చేయగానే, ఆమె ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పుడు ఆటోమేటిగ్గా బాధితురాలికి సిమ్ బ్లాక్ అయినట్టు చూపిస్తుంది. దీనిపై ఆమె కస్టమర్ కేర్ ను సంప్రదించింది. అదే నంబర్ పై సిమ్ యాక్టివేట్ అయ్యేందుకు దరఖాస్తు చేసుకుంది.

కొన్ని గంటల్లోనే సిమ్ అన్ లాక్ అయింది. అయితే ఆ వెంటనే ఆమె ఎకౌంట్ నుంచి 24 లక్షల 14వేల రూపాయలు వేరే ఎకౌంట్ కు ట్రాన్సఫర్ అయ్యాయి. సిమ్ ను యాక్టివేట్ చేయించేలోపు ఆన్ లైన్ దొంగలు. ఆమె ఖాతాను ఆపరేట్ చేశారు. ముందుగా సంబంధిత బ్యాంక్ కు ఫోన్ చేసి, ఎకౌంట్ లావాదేవీల లిమిట్ ను పెంచుకున్నారు. ఆ వెంటనే డబ్బులు వేరే ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. బాధితురాలు తన రోజువారీ లావాదేవీల్ని 5 లక్షలకే పరిమితం చేసుకునేలా లిమిట్ విధించుకున్నారు. దాన్ని ఆన్ లైన్ మోసగాళ్లు 25 లక్షలకు పెంచారు. ఆ వెంటనే డబ్బు కాజేశారు. ఇక్కడ బాధితురాలు చేసిన తప్పు ఏంటంటే.. తన సిమ్ బ్లాక్ అయిన వెంటనే ఆ విషయాన్ని బ్యాంక్ అధికారులకు కూడా చెప్పకపోవడం. సిమ్ బ్లాక్ అయిన వెంటనే బ్యాంక్ కు ఫోన్ చేసి తన లావాదేవీల్ని తాత్కాలికంగా ఆపేయమని ఆమె కోరి ఉంటే ఈ మోసం జరిగేది కాదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    
  • Scam 
  • Hyderabad 
  • online 
  • Cybercriminals 
  • police 
  • Malware 
  • money 
  • cybercrime 
  • hacker 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS