‘స్పాటిఫై’లో అదిరిపోయే ఫీచర్.. మూడ్‌ను బట్టి పాట..!
స్పాటిఫై మొబైల్ యాప్ ఇటీవల సంగీత ప్రియులను, యువతను బాగా ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాప్‌లో లక్షలకొద్ది పాటలు వినే అవకాశం ఉండటంతో వినియోగదారులు ఫిదా అవుతున్నారు. అయితే తాజాగా ఈ యాప్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ మీ మూడ్‌ను పసిగటేస్తుందట. మీ మూడ్‌కు తగిన పాటలను వినిపిస్తుంది.
మ్యూజిక్-స్ట్రీమింగ్ సంస్థ స్పాటిఫై టెక్నాలజీకి పేటెంట్ మంజూరు అయింది.
యూజర్ల మూడ్‌ను బట్టి స్పాటిఫై పాటలను ప్లే చేస్తుందట.
అయితే స్పాటిఫై స్ట్రీమింగ్ కంపెనీ 2018 ఈ టెక్నాలజీ పేటెంట్స్ కోసం ఫిబ్రవరిలో ఫైల్ చేసింది. ప్రస్తుతం ఈ టెక్నాలజీకి పేటెంట్స్ మంజూరు అయిందని మ్యూజిక్ కంపెనీ వెల్లడించింది.మాటల శబ్ధం ఆధారంగా అతడు ఏ మూడ్‌లో ఉన్నాడో.. పసిగట్టి మ్యూజిక్‌ను ప్లే చేస్తుందట.నిజంగా స్పాటిఫై పని తీరు అద్భుతమే అని చెప్పాలి. మనం బాధలో ఉన్నప్పుడు కాస్త సెంటిమెంట్స్ సాంగ్స్ ఇష్టపడతాం, సంతోషంలో ఉంటే హుషారెక్కించే పాటలు వింటుంటాం.
ఇప్పుడు స్పాటిఫై యాప్ మన వాయిస్ విని మనం సంతోషం గా ఉన్నామా లేక బాధలో ఉన్నామా అనేది నిర్ణయిస్తుంది. దానిని బట్టి సాంగ్స్ ప్లే అవుతుంటాయి. వాయిస్ ని బట్టి పిల్లలా.. లేక వృద్ధులా అనేది స్పాటిఫై నిర్ధారణ చేస్తుంది. వారి ఇష్టాలను బట్టి పాటలు ప్లే అవుతుంటాయి. అందుకే ఇప్పుడు అందరినీ స్పాటిఫై ఆకట్టుకుంటోంది.