‘అన్నమయ్య’ పాపం రాష్ట్రానిదే!

Update: 2021-12-04 05:27 GMT
కడప జిల్లాలోని అన్నమయ్య రిజర్వాయర్ ప్రాజెక్టు కొట్టుకుపోవడం లో రాష్ట్ర ప్రభుత్వాని దే తప్పని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ పరోక్షంగా తేల్చేశారు. పార్లమెంటు లో జరిగిన ఓ చర్చలో మంత్రి మాట్లాడుతూ అన్నమ్మయ్య పాపం రాష్ట్ర ప్రభుత్వాని ది కాదా అంటూ నిలదీశారు.

ఈ ప్రాజెక్టు మట్టి కట్ట భారీ వరదల కు కొట్టుకు పోయిన ఘటనను ఇరిగేషన్ నిపుణులు ఒక కేసు స్టడీగా తీసుకోవటం చాలా బాధాకరమన్నారు. భారీ వర్షాల వల్ల ప్రాజెక్టు సామర్థ్యానికి మించి ఒకటిన్నర రెట్లు నీరు వచ్చిందన్నారు.

ప్రాజెక్టు లోని స్పిల్ వే తో పాటు గేట్ల ను ఎత్తేసి వచ్చిన నీటిని వచ్చినట్లుగా బయటకు పంపేసుంటే బాగుండేదన్నారు. ప్రాజెక్టులోని ఐదు గేట్లలో ఒకటి పనిచేయకపోయినా మిగిలిన నాలుగు గేట్లను మెల్లిగా ఎత్తేసుంటే సరిపోయదని మంత్రి అన్నారు.

కానీ అలా చేయకపోవటం తోనే ప్రాజెక్టు ఒక్కసారి గా తెగి పోయి నీరంతా బయటకు వచ్చేసిందన్నారు. ఎప్పుడైతే నీరంతా ఒక్క సారిగా బయటకు వచ్చేసిం దో చుట్టు పక్కల ప్రాంత మంతా మునిగి పోయి భారీ ప్రాణ నష్టం జరిగిందని షెకావత్ చెప్పారు.

గతం లో హిమాచల్ ప్రదేశ్ లోని మరో ప్రాజెక్టు విషయం లో కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. ప్రాజెక్టు లోని నీటిని బయటకు వదిలేసే టపుడు కనీస ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఒకేసారి గేట్లు ఎత్తేయటంతో 24 మంది తెలుగు విద్యార్థులు మరణించిన విషయాన్ని మంత్రి బాధతో ప్రస్తావించారు.

డ్యాముల భద్రతలో ఎవరి బాధ్యత ఎంత అనే విషయంపై జవాబుదారీతనాన్ని నిర్ణయించే వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదని మంత్రి పార్లమెంటును ప్రశ్నించారు.

నిజానికి కేంద్ర మంత్రి వేసిన ప్రశ్నలు అర్ధవంతంగానే ఉన్నాయి. ప్రాజెక్టుల్లో సమస్యలు తలెత్తకూడదన్నా, ప్రమాధాలు జరగకూడదన్న కచ్చితంగా జవాబుదారీతనం ఉండాల్సిందే. భారీ వర్షాలు, వరదలను ఎవరు ఆపలేరన్నది వాస్తవం. కానీ వర్షాలు, వరదలు వస్తున్నపుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాల్సింది మాత్రం ప్రభుత్వ యంత్రాంగమే అనడంలో సందేహం లేదు.

ఇపుడు అన్నమయ్య ప్రాజెక్టునే తీసుకుంటే మంత్రి చెప్పినట్లుగా వరద ప్రవాహాన్ని అంచనా వేసి గేట్లు ఎత్తేసుంటే బాగుండేది. కానీ అలా కాకుండా అధికారుల నిర్లక్ష్యం వల్లే చివరకు డ్యాం కొట్టుకుపోయింది. గేటు పాడైపోయిందని, మట్టికట్ట వీకైపోయిందని స్ధానికులు, అప్పటి అధికారులు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

అయితే గత ప్రభుత్వం మీద బాధ్యత తోసేస్తామంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడచిన రెండున్నరేళ్ళల్లో ఏమి చేసిందనేదే అసలైన ప్రశ్న. కాబట్టి ఇక నుండైనా కేంద్రంతోనో మరొకరితోనో చెప్పించుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అందరికీ మంచిది.
Tags:    

Similar News