మాటలతో నెహ్రును ఎక్కడికో తీసుకెళుతున్నారే

Update: 2016-03-23 06:48 GMT
అనుకున్న గుర్తింపు దక్కకుంటే ఆ బాధే వేరుగా ఉంటుంది. పుండు మీద కారం చల్లినట్లుగా.. బాధలో ఉన్నప్పుడు.. ఆ బాధను మరింత పెంచేలా ఉండే మాటలు మరింత ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జ్యోతుల నెహ్రు. ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పదవిని ఆయన ఆశించటం.. ఆయనకు కాకుండా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బుగ్గా రాజేంద్రనాథ రెడ్డి (కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే)కి ఇవ్వటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. నెహ్రును కలిసిన పలువురు ఏపీ అధికారపక్ష నేతలు ఆయన్ను తమ మాటలతో ఎక్కడికో తీసుకెళుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈ వాదనలో నిజం ఉందంటూ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాటల్ని ప్రస్తావిస్తున్నారు. నెహ్రును కలిసిన సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ.. తనకు దక్కిన ఉప ముఖ్యమంత్రి పదవి తనది కాదని.. జ్యోతుల కానీ తెలుగుదేశంలో ఉండే ఆయనే డిప్యూటీ సీఎం అయి ఉండేవారని వ్యాఖ్యానించారు. ఇక.. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అయితే.. నెహ్రుకు పీఏసీ ఛైర్మన్ పదవి వస్తుందని భావించినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఇలా ఏపీ అధికారపక్ష నేతలు జ్యోతులతో చేస్తున్న వ్యాఖ్యలు.. ఆయన్ను ఎక్కడికో తీసుకెళుతున్నాయన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి మాటలు విని.. అధినేతకు షాక్ ఇవ్వరు కదా?
Tags:    

Similar News