• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వాళ్ళతో పెట్టుకుంటున్న...

వాళ్ళతో పెట్టుకుంటున్న వైసీపీ...రిజల్ట్... ?

By - Tupaki Desk
Update: 2022-01-19 10:31 GMT
వైసీపీ ప్రభుత్వం రావాలని అంతా అనుకున్నారు. అలాంటి వాళ్ళలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ముందు భాగంలో ఉన్నారు. దానికి కారణం ఉద్యోగులకు వైఎస్సార్ అంటే ఇష్టం. ఆయన ప్రభుత్వ హయాంలో వారికి బాగా మేలు జరిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎపుడూ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటాయి. దాంతో జగన్ని కూడా అలాగే చూస్తూ ఆయన కావాలీ రావాలీ అనుకున్నారు. ఇక జగన్ వస్తే తమ జీతాలు ఊహకు అందనంత ఎక్కువగా పెరిగిపోతాయని కూడా భావించారు.

కానీ ఉద్యోగుల మీదనే ఇపుడు వైసీపీ సర్కార్ గట్టిగా చూస్తోంది అని వాపోతున్నారు. మేము ఇవ్వాల్సింది ఇంతే. ఆ మీదట మీ ఇష్టం అంటోంది సర్కార్. నిజానికి కొత్త పీయార్సీ వైసీపీ ప్రభుత్వం నుంచి ఇలా ఉంటుందని అసలు ఉద్యోగులు ఊహించలేదు. దాంతో వారు షాక్ తింటున్నారు. ఐర్ ఆర్ కంటే కూడా ఎక్కడా ఫిట్మెంట్ తగ్గిన సందర్భాలు లేవు దాంతో ఇది రివర్స్ పీయార్సీ అనేస్తున్నారు.

అంతే కాదు. తమకు రావాల్సిన అన్ని రకాల ఆర్ధిక ప్రయోజనాలను కూడా పూర్తిగా కోత పెట్టారని వారు గోల పెడుతున్నారు. కొత్త పీయార్సీ వల్ల ప్రతీ ఉద్యోగికి నెలకు కనీసంగా నాలుగు వేల రూపాయలు మేర ఆర్ధిక నష్టం సంభవిస్తుంది అని వారు అంటున్నారు.

సరే ఇవన్నీ ప్రభుత్వానికి తెలియవు అనుకోవడానికి లేదు. అయితే ఇప్పటికే వారికి ఇవ్వాల్సింది ఇచ్చేశామని అంటోంది. కొత్త పీయార్సీ వల్ల ఏకంగా ఖజనా మీద పది వేల కోట్ల రూపాయల భారం పడుతోంది అన్నది సర్కార్ పెద్దల వాదన. మొత్తానికి రెండు రోజుల క్రితం పీయార్సీకి సంబంధించి జీవోలు విడుదల చేసిన ప్రభుత్వం ఉద్యోగుల ఆందోళన విషయంలో ఏ రకంగాను ప్రస్తుతానికి రియాక్ట్ అయ్యేలా కనిపించడంలేదు

దాంతో ఉద్యోగులు సమ్మె వైపుగానే అడుగులు వేస్తున్నారు. ఇది అనివార్యమని, ప్రభుత్వమే తమను అలా నడిపిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. తమకు సహకరించాలని వారు ప్రజలను కోరుతున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రజలలో కొంత వ్యతిరేకత ఉంటుందని అందువల్ల వారు ఆందోళనకు వెళ్ళినా ఉపయోగం ఉండదన్న లెక్కలేవో సర్కార్ పెద్దలకు ఉన్నాయి. ఇప్పటికైతే ఉద్యోగులు సమ్మె చేస్తారు. వేరే విధంగా చేస్తారు. అయినా కూడా సర్కార్ దిగి రాకపోతే అన్న చర్చ కూడా ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు  13 లక్షల దాకా ఉన్నారు. వారికి వైసీపీ సర్కార్ మీద అయితే గట్టిగానే మండుతోంది.

ఆ మంటను వారు చల్లార్చుకోవడానికి సరైన టైమ్ కోసం చూస్తారు అన్నది రాజకీయ విశ్లేషణ. అదే కనుక జరిగితే 2024 ఎన్నికలు మాత్రం వైసీపీ సర్కార్ కి ఇబ్బందే అంటున్నారు. ఉద్యోగులతో గతంలో పెట్టుకున్న ప్రభుత్వాలు రాజకీయంగా ఇబ్బందులు పడ్డాయనే చరిత్ర చెబుతోంది. మరి ప్రజా మద్దతు విశేషంగా ఉందని భావిస్తున్న వైసీపీ పెద్దలు ఉద్యోగులను ఖాతరు చేయకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే మరో రెండేళ్లలో రానున్న ఎన్నికల దాకా ఎదురుచూడడమే.
Tags:    
  • PRC Issue 
  • AP PRC Issue 
  • Andhra Pradesh 
  • AP Sarkar 
  • AP employees 
  • Chief Secretary Sameer Sharma 

Similar News

సోనియా ఆత్మ‌కథ‌: జ‌నాల్లో క్రేజ్ ఎలా ఉందంటే!

2026-11-11 18:30 GMT

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత స‌త్తా చాటేనా?

2026-11-11 17:30 GMT

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

Copyright @2026

Powered by Blink CMS