నేడు ఏపీ కేబినెట్ భేటి.. కీలక అంశాలివే!

Update: 2020-11-27 07:15 GMT
ఏపీ కేబినెట్ ఈరోజు కీలక భేటికి నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో ఈ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ కేబినెట్ భేటిలో పలు బిల్లులు కూడా చర్చకు అవకాశం కనిపిస్తోంది. నివర్ తుఫాన్ ప్రభావం మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ 5 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి శీతాకాల సమావేశాల్లో 11 చట్టాల్లో సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక 3 కీలక బిల్లులు ఆమోదించుకోవాలని చూస్తోంది.

ఇక ఈసారి అసెంబ్లీని 3 రాజధానుల అంశం, స్థానిక సంస్థల ఎన్నికలు, అంతర్వేది ఘటన లాంటి అంశాలు కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో వాడివేడిగా వాగ్వాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసారి అసెంబ్లీ హోరెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తరుఫున మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అంశంపై చర్చకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేశారు.  ఉదయం 9 గంటల నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతుంది.

రాజ్యాంగం ప్రకారం ప్రతి ఆరు నెలల వ్యవధిలో ఒకసారి ఉభయ సభలు సమావేశమవ్వాలి. అందుకే ప్రభుత్వం తాజాగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్నిరోజులు అనేది తేలనుంది.
Tags:    

Similar News