మ‌హేశ్‌బాబు పాట‌ల‌కు డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన వైద్యులు

Update: 2020-06-07 11:00 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ విజృంభిస్తోంది.. వైర‌స్ బారిన ప‌డిన ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు వైద్యులు - వైద్య సిబ్బంది తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. వైర‌స్ యోధులుగా వారిని పిలుస్తున్నారు. వారిని ఇప్పుడు క‌నిపించే దేవుళ్లుగా భావిస్తున్నారు. వారంద‌రికీ అభినంద‌న‌లు - కృత‌జ్ఞ‌త‌లు ప్ర‌జ‌లు వివిధ రూపాల్లో చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఆంధ్ర ఆస్ప‌త్రి వైద్యులు - వైద్య సిబ్బంది - న‌ర్సులు మొత్త 75మంది క‌లిసి వినూత్నంగా కృత‌జ్ఞ‌త‌లు - ధ‌న్య‌వాదాలు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఇంట్లోనే ఉండండి.. జాగ్ర‌త్త‌లు పాటించండి క్షేమంగా ఉండండి అంటూ ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు. దీనికి వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

ఆంధ్ర ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ పీవీ రామారావు ఆధ్వ‌ర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది అంతా 75మంది కలిసి సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు సినిమాల్లోని పాట‌ల‌కు నృత్యాలు చేశారు. వైద్యులు - న‌ర్సులు - స‌ర్జ‌న్స్‌ లు త‌దిత‌రులు పాట‌ల‌కు అద్భుతంగా డ్యాన్స్‌లు చేసి అద‌ర‌గొట్టారు. స‌రిలేరు నీకెవ్వ‌రు - శ్రీమంతుడు - మ‌హ‌ర్షి సినిమాల పాట‌ల‌కు వారు నృత్యం చేసి అబ్బుర‌ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ పీవీ రామారావు మాట్లాడుతూ.. మ‌హమ్మారి వైర‌స్ నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి తాము త‌మ నృత్యంతో కృత‌జ్ఞ‌తలు చెప్పిన‌ట్లు తెలిపారు.


Full View

Tags:    

Similar News