• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇసుక‌ - మ‌ద్యంపై ఏపీ...

ఇసుక‌ - మ‌ద్యంపై ఏపీ క‌ఠిన నిర్ణ‌యం: అక‌్ర‌మ ర‌వాణా చేస్తే క‌ట‌క‌టాలే

By - Tupaki Desk
Update: 2020-05-31 07:11 GMT
ప‌క్క రాష్ట్రం తెలంగాణ‌లో ఇసుక‌ - మ‌ద్యం విష‌యంలో ధ‌రలు త‌క్కువగా ఉండ‌డంతో పాటు విరివిగా ల‌భిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో మ‌ద్యం - ఇసుక‌పై తీవ్ర ఆంక్ష‌లు ఉన్నాయి. దీంతో ఏపీవాసులు తెలంగాణ వైపు క‌న్నేశారు. ఈ రెండింటిని అక్ర‌మంగా తెలంగాణ నుంచి ఏపీలోకి త‌ర‌లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప‌లుచోట్ల పోలీసులు స్వాధీనం చేసుకుని వారిపై కేసులు కూడా న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా మ‌ద్యం తెలంగాణ నుంచి ఏపీకి అక్ర‌మంగా పెద్ద‌సంఖ్య‌లో స‌ర‌ఫ‌రా అవుతోంది. దీంతో ఆ ప్ర‌భుత్వం నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇక‌పై ఇసుక - మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోప‌నున్న‌ట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్‌ లాల్ ప్ర‌క‌టించారు. రాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ముమ్మర త‌నిఖీలు చేస్తూ ఇసుక - మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా స‌మావేశంలో ఆయన వివ‌రాలు వెల్ల‌డించారు.

ఇప్పటివరకు మ‌ద్యం - ఇసుక అక్ర‌మ ర‌వాణా విష‌యంలో 485 కేసులు నమోదు చేశామ‌ని - 955 మందిపై కేసులు - 730 వాహనాలను సీజ్‌ చేసిన‌ట్లు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా 29,629 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఇసుక‌ - మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాను అరిక‌ట్టేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాత్రివేళల్లో గస్తీని ప‌కడ్బందీగా ఏర్పాటు చేసి మెరుపు దాడులు చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక - మద్యం అక్రమ రవాణా విషయంలో ప్ర‌భుత్వం - అధికారులు ఎన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నా - ప్రజల సహకారం తప్పకుండా ఉండాలని కోరారు.

ఇక‌పై ఇసుక - మద్యం అక్రమ రవాణాలో పట్టుబడితే మాత్రం ఊహించ‌ని చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. పాత నేరగాళ్లు అయితే పీడీ యాక్టు ప్రయోగిస్తామని ప్ర‌క‌టించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై రౌడీషీట్స్ తెరిచే ఆలోచ‌న‌లు కూడా చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ క్ర‌మంలోనే వారి ఆస్తులను కూడా జప్తు చేసేందుకు సిద్ధ‌మని స్ప‌ష్టం చేశారు.

Tags:    
  • Andhra Govt 
  • Sand and Liquor Transporation 
  • Telugu News 

Similar News

డిసెంబరులో కీలక మార్పులు.. రాయలసీమ నుంచి కొత్త మంత్రులు

2026-11-02 13:55 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

'పదకొండు' ముహూర్తం బాగుంది.. వాళ్లు భుజాలు తడుముంటే నేనేం చేయాలి : విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-02 13:50 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

వరుస తుఫాన్లు.. చంద్రబాబుకు ఎన్నో విధాల మేలు

2026-11-02 12:30 GMT

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

Copyright @2026

Powered by Blink CMS