జాబ్ వదిలేసే సచివాలయ ఉద్యోగులకు గట్టి షాక్

Update: 2020-03-15 10:19 GMT
ఏపీలో సచివాలయ ఉద్యోగులకు ఎంతో డిమాండ్ వచ్చింది. నిరుద్యోగులు చాలా మంది పోటీపడ్డారు. బాగా చదివిన కంటెంట్ ఉన్న వాళ్లు ఈ ఉద్యోగాలు పొంది గ్రామాల్లో సేవ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సచివాలయ ఉద్యోగం కంటే మెరుగైన ఉద్యోగాలు రావడంతో వెళ్లడానికి రాజీనామా చేస్తున్నారు.కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. వైసీపీ సర్కారు సచివాలయ ఉద్యోగులకు షాకిచ్చింది.
 
 గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల పోస్టులను ఏపీలోని జగన్ సర్కారు తీసుకొచ్చింది. వాటిని భర్తీ కూడా చేసేసింది. సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అందించే డ్యూటీని వీరిపైన పెట్టింది.

అయితే ఉద్యోగాల్లో చేరడానికి పెద్ద తంతగమే నడిచింది. గ్రూప్ 2 లెవల్లో పరీక్ష రాసి పాసి అయి ఈ కొలవుల్లో చేరారు. పరీక్ష అంత కఠినంగా ఉందని చెప్పుకొచ్చారు.

ఈ సచివాలయ ఉద్యోగాల్లో పీజీ, డిగ్రీ చేసిన వారు ఎక్కువగా విధుల్లో చేరారు. వీరికి లక్షలు ఖర్చు పెట్టి వైసీపీ సర్కారు శిక్షణ ఇచ్చింది. జీతాలు చెల్లించింది. అయితే పలువురికి తాజాగా ఇంతకంటే ఎక్కువ జీతం, మెరుగైన రైల్వే, బ్యాంకింగ్, ఇతర ఉద్యోగాలు వచ్చాయి. వారు ఈ సచివాలయ ఉద్యోగాలను వదిలి వెళ్లాలనుకున్నారు. రాజీనామా చేశారు. కానీ వైసీపీ సర్కారు వారి రాజీనామాను ఆమోదించడం లేదు.  అదంత ఈజీకాదని తాజాగా ప్రభుత్వం  వారికి గట్టి షాక్ ఇచ్చింది. సచివాలయ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉద్యోగి జీతం ఎంతైతే తీసుకున్నాడో ఆ మొత్తంతోపాటు శిక్షణకు అయిన ఖర్చు కూడా తిరిగి ఇస్తేనే రాజీనామా ఆమోదిస్తామని మెలిక పెట్టారు.

దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నేవారిపల్లె గ్రామ సచివాల ఉద్యోగి మహేష్ రెడ్డి  తాజాగా తాను తీసుకున్న మొత్తం కలిపి 57095 ప్రభుత్వానికి కట్టి పెద్ద ఉద్యోగానికి వెళ్లిపోయారు.  ఇతడు ఒక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు సచివాలయ ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారు ఇలానే ప్రభుత్వం పెట్టిన ఖర్చును వెనక్కి ఇవ్వాలని  ఉద్యోగాల్లో చేరేటప్పుడే రూల్ నంబర్ 9లో ప్రస్తావించారు. నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వం ఇప్పుడు రికవరీ చేస్తోంది.

ప్రభుత్వ కఠిన నిబంధనలతో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆ ఉద్యోగాన్ని వదిలివెళ్లడం అంత ఈజీ కావడం లేదు. వీరికి శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు, తీసుకున్న వేతనాలను తిరిగి చెల్లిస్తేనే రాజీనామాను ఆమోదిస్తామని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారట.. లేదంటే మెరుగైన ఉద్యోగం వదలుకొని చచ్చినట్టు ఈ సచివాలయ ఉద్యోగం చేయమంటున్నారట.. అంత మంచి జీతం వచ్చే బయటి ఉద్యోగాలకు పోలేక.. ఈ వేలు మాత్రమే వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదలలేక ఇప్పుడు ఉద్యోగాలు పొందిన వారు నరకయాతన పడుతున్నారట.. ఇలాంటి నిబంధనలు ఎక్కడా ఉండవని.. తమ భవిష్యత్ కోసం సడలించాలని సర్కారును కోరుతున్నారు.


Tags:    

Similar News