సర్వేలు అట్టర్ ఫ్లాప్ !
తాజాగా చూస్తే దేశంలోని నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో చేసిన ప్రీ పోల్ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కానీ పూర్తిగా ఫ్లాప్ అయ్యాయి.;
అవును ప్రతీ సారీ ఇదే జరుగుతోంది. కానీ ఎన్నికల ముందు ప్రీ పోల్ సర్వేలు అంటూ చేస్తున్నారు. అవి కూడా విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ఇన్ని శాంపిల్స్ అంటూ చెబుతూంటారు. వివిధ వర్గాలతో మాట్లాడామని అనేక సెక్షన్ల నుంచి ఒపీనియన్ కలెక్ట్ చేశామని చెబుతూ ఉంటారు. తీరా చూస్తే ఈ సర్వేలు అన్నీ ట్రాష్ అని అర్ధమయ్యేలా అసలైన ఫలితాలు వస్తూంటాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ తో కూడా జనాలను ఫూల్స్ ని చేస్తున్న సందర్భం ఇటీవల కాలంలో అధికం అయింది. ఈ సర్వేశ్వరులు ఎవరో కానీ ఓటర్ల మదిలో ఏముందో పట్టుకోలేకపోతున్నారు అని కూడా విమర్శలు ఉన్నాయి.
ఫ్లాప్ అయ్యాయని :
తాజాగా చూస్తే దేశంలోని నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో చేసిన ప్రీ పోల్ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కానీ పూర్తిగా ఫ్లాప్ అయ్యాయి. ఏ ఒక్కరూ కూడా ఫలితాల దరిదాపుల్లోకి రాలేకపోయారు. తమిళనాడులో మాత్రం విజయ్ పార్టీ టీవీకే గెలుస్తుందని యాక్సిస్ మై ఇండియా సర్వే చెప్పింది. అది కొంత దగ్గరగా అనిపించింది తప్ప అన్ని సర్వేలూ అసలు విషయాన్ని జనం నుంచి రాబట్టలేక పోయాయి.
ఎంతటి వైఫల్యం అంటే :
పోనీ ప్రీ పోల్ సర్వేలో విజయ్ పార్టీ అండర్ కరెంట్ గా ఉందని చెప్పలేకపోయారు. కానీ ఎగ్జిట్ పోల్స్ లో అయినా ఇంత సునామీని పసిగట్టలేకపోయారు అంటే ఈ తరహా సర్వేలు దేనికి అన్న చర్చ వస్తోంది. అంతే కాదు ఏ ప్రమాణాలతో చేస్తున్నారు. ఏ విధంగా ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు అన్న చర్చ కూడా వస్తోంది. చాలా సర్వేలు అయితే అప్పటికి అధికారంలో ఉన్న పార్టీల మెప్పు కోసం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తమిళనాడులో డీఎంకే గెలుస్తుందని తొంబై తొమ్మిది శాతం సర్వేలు చెప్పడం ఇందులో భాగం అనుకుంటే అవన్నీ పప్పులో కాలేశాయని చెప్పక తప్పదు.
సైలెంట్ వేవ్ అనుకున్నా :
విజయ్ పార్టీ టీవీకే అతి పెద్ద పార్టీగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు రాబట్టింది. అయితే అంత పెద్ద ఎత్తున జనాలు ఆ వైపునకు మళ్ళుతూంటే ఇంకా ఓల్డ్ పాటర్న్ లో సర్వే సంస్థలు తమ విధానాన్ని అనుసరిస్తున్నాయా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో జెన్ జీ అన్న ఒక కొత్త సెక్షన్ ఆవిర్భవించింది అన్నది సర్వే సంస్థలు మరచిపోయాయా లేక మిస్ అయ్యాయా అన్నది కూడా చర్చగా ఉంది. ఈసారి సర్వేలు చూస్తే అన్నీ దాదాపుగా తప్పుగానే చెప్పాయని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో మంతా బెనర్జీ మళ్ళీ వస్తుందని చాలా సర్వేలు చెప్పాయి. ఫలితాలు చూసి షాక్ తినే పరిస్థితి ఉంది. ఇక మరో వైపు చూస్తే మమతకు బీజేపీకి టైట్ ఫైట్ అని బీజేపీ గెలుపు అసాధ్యం అని కూడా చాలా సర్వేలు చెప్పాయి. కానీ జరిగింది చూస్తే భిన్నంగా ఉంది. మరి కొన్ని సర్వేలు టైట్ ఫైట్ అవుతుందని ఎడ్జ్ మాత్రం మమతకే అని చెప్పేశాయి.
కేరళ అస్సాం లలో :
ఇక కేరళలో అస్సాంలలో సైతం సర్వే సంస్థలు పూర్తి విషయాలను రాబట్టలేకపోయాయి. కేరళంలో భారీ ఆధిక్యత యూడీఎఫ్ కి వచ్చింది. అలాగే అస్సాం లో చూస్తే బీజేపీ అక్కడ గెలుస్తుందని చెప్పాయి కానీ ప్రభంజనాన్ని ఊహించలేకపోయాయి. వీటిని బట్టి చూస్తే సర్వేలు చేస్తున్న తీరు కానీ వాటి ప్రమాణాలు కానీ నమ్మబుద్ధిగా లేవని అంటున్నారు. అందుకే సర్వే ఫలితాలు ఫెయిల్ అవుతున్నాయి అంటున్నారు. సర్వేలు చేసే సంస్థల నిష్పాక్షికత మీద కూడా చర్చ సాగుతోంది. పవర్ లో ఉన్న వారిని నొప్పించకుండా చేస్తే ఇలాగే సర్వే నివేదికలు వస్తాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈసారి సర్వేలు అన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయనే అంటున్నారు.