బాబు తాజా ఐడియాను కేసీఆర్ కాపీ చేస్తారా?

Update: 2016-03-26 06:26 GMT
సరికొత్తగా ఆలోచించటం.. వినూత్న పథకాల్నిప్రవేశ పెట్టే  విషయంలో తెలంగాణ.. ఏపీ సర్కారులు కాస్త కుడి ఎడంగా స్టార్ట్ చేయటం తెలిసిందే. తాజాగా అలాంటి వినూత్న పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది ఏపీ సర్కారు. అనారోగ్యానికి గురై.. మంచానికే పరిమితమైన వారింటికే రేషన్ సామాను సరఫరా చేసే.. ‘‘మీ ఇంటికి మీ రేషన్’’ పథకాన్ని అమలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.

రేషన్ దుకాణాలకు రాలేని వారి కోసం ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. ఏప్రిల్ 7 నుంచి మీ ఇంటికే మీ రేషన్ పథకం అమల్లోకి వస్తుందని ఆమె ప్రకటించారు. ఈ పథకం సరిగా అమలు చేస్తే.. గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో అసరా లేని వారికి ఎంతో ప్రయోజనకరంగా  ఉంటుందనటంలో సందేహం లేదు. అంతేకాదు.. వచ్చే నెల నుంచి ఒకటో తారీఖు నుంచి  ప్రతి రేషన్ షాపులో బియ్యం.. చక్కెర.. గోధుమపిండి.. కిరోసిన తప్పనిసరిగా పంపిణీ చేయాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. ఏపీ పౌరసరఫరాల శాఖలో చేస్తున్న మార్పులు తెలంగాణలోని కేసీఆర్ సర్కారు అమలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News