ఏపీ కేబినెట్ నిర్ణయం: చినజీయర్ కు 40 ఎకరాలు

Update: 2020-01-27 08:54 GMT
శాసనమండలి రద్దుతోపాటు ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను సోమవారం తీసుకుంది. ప్రధానంగా శాసనమండలి రద్దు తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకుంది.

విజయవాడలో చినజీయర్ ట్రస్ట్ కు 40 ఎకరాలు కేటాయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. కడప ఆర్అండ్బీ ఆఫీసు ఆవరణలో టీడీపీ కార్యాలయం తొలగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

చిన్నజీయర్ స్వామి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ - జగన్ కు అత్యంత సన్నిహితులు. ఇద్దరు సీఎంలు చిన్నజీయర్ స్వామీ ఆశీస్సులు తీసుకున్న వారే.. యాదగిరి గుట్ట జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీని ఏర్పాటు చేయడం కోసం కేసీఆర్ సర్కారు చిన్నజీయర్ స్వామికి గతంలో 2.30 ఎకరాలను గతంలో యదాద్రి జిల్లా యాదగిరి గుట్ట మండలం గుండ్లపల్లిలో కేటాయించింది. ఎకరం 6 లక్షల చొప్పున 16.50 లక్షలకు ఈ భూమిని యాదాద్రి డెవలప్ మెంట్ ఆథారిటీ చిన్నజీయర్ స్వామికి విక్రయించింది.

అయితే ఈ కోవలోనే ఏపీలోనూ చిన్నజీయర్ స్వామి ట్రస్టు ఏర్పాటుకు సీఎం జగన్ నిర్ణయించారు.  విజయవాడలో చిన్నజీయర్ కు 40 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Tags:    

Similar News