ప్రముఖ బిజినెస్‌మెన్ ఆనంద్ మహీంద్ర గొప్ప మనసుతో కేరళకు చెందిన ఆటోడ్రైవర్ కు అదృష్టం తలుపుతట్టింది. ఆటోవాలా సునీల్ సృజనాత్మకతకు ఫిదా అయిపోయిన మహీంద్ర..అతనికి స్వయంగా 4 వీలర్ వాహనాన్ని బహుమతిగా అందించారు. వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన సునీల్ ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. సునీల్ తన ఆటోను అందరిలా కాకుండా స్కార్పియోలో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగించేలా డిజైన్ చేశాడు. అచ్చు స్కార్పియోలా ఉన్న ఆటో రోడ్డుపై వెళుతుండగా ఎవరో ఫొటో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సునీల్ డిజైన్ చేసిన ‘స్కార్పియో ఆటో’ ఫొటోను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ లో చూశారు. దీనిపై ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ ‘ట్విట్టర్ లో ఫొటో షేర్ చేసిన వారికి ధన్యవాదాలు. ఎవరైనా ఆటోవాలా వివరాలు తెలుసుకొని చెప్తారా?, తెలిస్తే అతని వద్ద నుంచి ఆ ఆటోను కొనుక్కుని, దానికి బదులు ఫోర్ వీలర్ వాహనాన్ని ఇస్తానని’ ట్వీట్ చేశారు.
ఆటోవాలా వివరాలు తెలుసుకున్న ఆనంద్ మహీంద్ర తాను ఇచ్చిన మాట ప్రకారం సునీల్‌ను స్వయంగా కలుసుకుని ఆ ఆటో తీసుకున్నారు. దానికి బదులుగా సునీల్‌కు మహీంద్ర సుప్రో మినీ వ్యాను ( ఫోర్ వీలర్)ను బహుమతిగా అందజేశారు. ‘ఇతనే సునీల్.. ఒకప్పుడు 3 వీలర్ వెహికల్ యజమాని, ఇప్పుడు 4 వీలర్ వెహికిల్‌కు యజమాని. థ్యాంక్యూ’ అంటూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. సునీల్ డిజైన్ చేసిన స్కార్పియో ఆటోను ఆనంద్ మహీంద్ర తన మ్యూజియంలో పెట్టేందుకు తీసుకోవడం విశేషం. మొత్తంగా ఒక కాపీ ఐడియా ఆనంద్ మహీంద్రాకు పెద్ద ఎత్తున నచ్చడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/