తిరుగుబాటు చేస్తే రేప్ చేయిస్తున్నారట?

Update: 2016-07-25 09:27 GMT
ప్రపంచంలోని చాలా దేశాల్లో - ఆ మాటకొస్తే సుమారు అన్ని దేశాల్లో ప్రభుత్వాలు తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రజలకు నచ్చకపోవడం - వాటిపై ఆయా ప్రజలు తిరుగుబాటు చెయ్యడం సర్వసాదారణమైన విషయం! ఆ సమయంలో అలా తిరుగుబాటుచేసే వారిపై పోలీసులు వాటర్ చల్లో - టియర్ గ్యాస్ ప్రయోగించో - గాల్లోకి కాల్పులు జరిపో చెల్లాచెదురుచేయడం జరుగుతుంటుంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన - ప్రజలను ఇబ్బందిపెట్టిన వారిపై కేసులు కూడా నమోదవుతుంటాయి. అయితే ఇలాంటి వ్యవహారమే టర్కీలోనూ జరిగింది.. ఫలితంగా 13,165 మందిని ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.

అక్కడివరకూ బాగానే ఉంది కానీ.. అసలు సమస్య ఇక్కడినుంచే మొదలైంది. ఇలా అదుపులోకి తీసుకున్నవారిపై టర్కీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందట. వీరికి ఆహారం - మంచినీరు అందించకపోవడమే కాకుండా, తీవ్రంగా కొడుతూ, కొందరు మహిళలపై లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారట. ఈ విషయాలన్నీ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లండించింది. వీటికి సంబందించిన ఆధారాలు కూడా తమవద్ద ఉన్నాయని గట్టిగా చెబుతోంది.

అయితే ఈ విషయంపై స్పందించిన టర్కీ ప్రభుత్వం మాత్రం.. వాటిని తోసి పుచ్చింది. దానితోపాటు.. యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్న తమ దేశం అలాంటి చర్యలకు పాల్పడదని తెలిపింది. కాగా.. ఈ తిరుగుబాటు సమయంలో జరిగిన దాడుల్లో సుమారు 246 మంది మరణించగా, 2000కు పైగా గాయపడ్డారని సమాచారం!!
Tags:    

Similar News