ట్రంప్ కి ఘోర అవమానం ... మిడిల్ ఫింగర్ చూపిస్తూ హేళన !

Update: 2020-11-11 08:10 GMT
అదేంటో గానీ ట్రంప్ ‌కు సంబంధించిన ఏ వార్త అయినా తెగ వైరల్ అవుతుంటుంది. ఇది మంచికా చెడుకా అన్న మీమాంస పక్కన పెడితే.. వార్తలు మాత్రం యమా ఆసక్తిగా ఉంటాయి. తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ బైడెన్ చేతుల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.  అలాంటిది ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ ‌కి ఫేర్‌వెల్ చెబుతూ ప్రజలు ,అత్యంత ఘోరంగా అవమానిస్తున్నారు. ఇప్పటివరకు  ఏ అమెరికా అధ్యక్షుడికీ ఇంత ఘోరమైన సెండాఫ్ ఇవ్వలేదంటే అతిశయోక్తిలేదు. ట్రంప్ పై ఉన్న కోపాన్ని ఎన్నికల్లో చూపించారు.  జో బిడెన్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఇదివరకు రిపబ్లికన్ల అడ్డాలుగా ఉన్న రాష్ట్రాల్లోనూ డెమొక్రటిక్ నేత జో బిడెన్ ఈసారి విజయం సాధించారు.

 ట్రంప్‌పై ప్రజల్లో ఎంత అసహనం ఉందో దీన్ని బట్టీ అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు , తాజాగా ట్రంప్ కాన్వాయ్ వెళ్తుండగా  రోడ్డు పక్కన నిల్చున్న ప్రజలు ట్రంప్ కి  మిడిల్ ఫింగర్ చూపించడం తీవ్ర కలకలం రేపింది.జో బిడెన్ తన విజయానికి సంబంధించి ప్రకటన చేస్తున్నప్పుడు... ట్రంప్  ఓ గోల్ఫ్ క్లబ్ దగ్గర ఉన్నారు. అక్కడి నుంచి ఆయన వైట్‌హౌస్‌కి వెళ్తుండగా...ఇంకెందుకు వైట్ హౌస్‌ కి  వెళ్లొద్దు అంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. రోడ్లపక్కన నిల్చొని నిరసన తెలిపారు.మిడిల్ ఫింగర్ చూపిస్తూ నీ ఉద్యోగం ఊడింది  అని అరిచారు. ట్రంప్‌కి గుడ్ బై చెబుతూ  పోస్టర్లు అంటించారు

ఈ ఎన్నికల్లో జో బిడెన్ 290 ఎలక్టొరల్ ఓట్లు సాధించారు. ఫలితంగా ట్రంప్ తీవ్ర అవమానంతో పదవి కోల్పోవాల్సి వస్తోంది. జో బిడెన్ , ఇదివరకు ఏ అమెరికా అధ్యక్షుడికీ రానన్ని ఎక్కువ ఓట్లతో వైట్‌ హౌస్ ‌లో అడుగు పెట్టబోతున్నారు. జో బిడెన్ ‌కి 7కోట్ల 40లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. 2008లో బరాక్ ఒబామాకి 6,94,98,516 ఓట్లు వచ్చాయి. అప్పట్లో అదో రికార్డు. దాన్ని బిడెన్ తిరగరాశారు. ట్రంప్ లాంటి మొండి ఘటాన్ని ఆయన ఎదుర్కొని విజేతగా నిలిచారు.
Tags:    

Similar News