• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇజ్రాయెల్ తర్వాత మాస్కు...

ఇజ్రాయెల్ తర్వాత మాస్కు లేకుండా తిరిగే లగ్జరీ అగ్రరాజ్యంలో!

By - Tupaki Desk
Update: 2021-04-28 04:21 GMT
ముఖానికి మాస్కు లేకుండా వీధుల్లో తిరగటం పెద్ద విషయం కాదు. కానీ.. అదంతా ఒకప్పుడు. ఇవాల్టి రోజున ఇంట్లోనూ మాస్కు పెట్టుకోవాలన్న దరిద్రపుగొట్టు రోజులు రావటం తెలిసిందే. కరోనా లాంటి కష్టకాలంలో ముఖానికి మాస్కు లేకుండా తిరిగే భాగ్యం.. కచ్ఛితంగా లగ్జరీనే అవుతుంది. ఇలాంటి విలాసాన్ని తమ ప్రజలకు అందించిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. ప్రపంచంలో మరే దేశం చేయని ప్రకటనను ఆ దేశం చేసింది.

ముఖానికి మాస్కు లేకుండా వీధుల్లో తిరిగే అవకాశాన్ని కల్పిస్తూ.. అధికారిక ప్రకటన చేసింది. దీన్ని చూసిన చాలా దేశాలు.. తమకు ఆ అవకాశం లేకుండా పోయిందన్న వేదన చెందారు. తాజాగా అదే జాబితాలోకి మరో దేశం నిలిచింది. అదే.. అగ్రరాజ్యమైన అమెరికా. అమెరికాలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.

ఇప్పటికి విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం అమెరికాలోని యుక్తవయసు ఉన్న వారిలో సగం మందికి పైనే వ్యాక్సిన్ అందింది. ఈ నేపథ్యంలో అమెరికా అంటువ్యాధుల నివారణ కేంద్రం ఆసక్తికర ప్రకటనను విడుదల చేసింది. దీని ప్రకారం.. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు ముఖానికి మాస్కు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే.. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మాత్రం మాస్కు పెట్టుకోవటం మంచిదన్న సూచన చేసింది.

కరోనా కారణంగా కోల్పోయిన స్వాతంత్య్రాన్ని అమెరికా తిరిగి తెచ్చుకుందంటూ ఆ దేశానికి చెందిన ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ మైక్ సాగ్ రియాక్టు అవుతూ.. అమెరికాలో స్వాతంత్య్రం తిరిగి వచ్చిందని.. ఆగ్రరాజ్యంలో మామూలు పరిస్థితులు నెలకొన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి ముఖానికి మాస్కు లేకుండా బయటకు వెళ్లే.. ప్రాథమిక స్వేచ్ఛను కల్పించిన రెండో దేశంగా అమెరికా నిలుస్తుందని చెప్పాలి.
Tags:    
  • Dangerous Disease In America 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Telugu News Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS