గూగులమ్మకు రూ.73 లక్షల కోట్ల ఫైన్.. ఎందుకంటే?

Update: 2020-12-14 03:34 GMT
ప్రముఖ సెర్చ్​ఇంజిన్​ గూగుల్​కు అమెరికా ప్రభుత్వం షాక్​ ఇచ్చింది. సెర్చ్​, యాడ్స్​ విషయం లో గూగుల్​ యాంటీట్రస్ట్​ చట్టాన్ని బ్రేక్​ చేసిందని అమెరికా ఆరోపిస్తున్నది. అమెరికాకు చెందిన డిపార్ట్​మెంట్​ ఆఫ్​ జస్టిస్​ దావా వేసింది. ఈ దావాకు కాలిఫోర్నియా డెమొక్రాట్​ రాష్ట్ర అటార్నీ జనరల్​ కూడా మద్దతు ఇచ్చారు. గూగుల్​ 1 ట్రిలియన్​ డాలర్లు. (రూ.73,73,830 కోట్లు) ఫైన్ వేయాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి.

 ఈ ఆరోపణలను గూగుల్​ ఖండించింది. తాము వినియోగ దారులను ప్రభావితం చేయడం లేదని స్పష్టం చేసింది. యాడ్స్​ విషయంలో సెర్చ్​ విషయంలో వినియోగదారుల అభిప్రాయాలు రోజుకో రీతిగా మారుతుంటాయని.. వారిని మేము ప్రభావితం చేయడం లేదని స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసుపై తాము కోర్టులో పోరాడతామని కూడా స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసుపై విచారణ కొనసాగుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

డిసెంబర్ 18న గూగుల్​ ప్రతినిధులు విచారణ కు హాజరు కావాలని అమెరికా జిల్లా జడ్జి అమిత్ మెహతా ఆదేశించారు. గూగుల్​ పై ఇటువంటి ఆరోపణలు కొత్తకాదు. గతంలోనూ వచ్చాయి. గూగుల్​ సంస్థ వినియోగదారుల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నదని గతంలో బ్రిటన్​ కూడా ఆరోపించింది. ఈ విషయంపై బ్రిటన్​లోనూ కేసు నడుస్తోంది. ఓ ప్రముఖ సంస్థపై వరసగా ఓకే రకమైన ఆరోపణలు రావడం గమనార్హం.
Tags:    

Similar News