కిడ్నాప్ లో అఖిలప్రియ తమ్ముడితో పాటు.. ఆ కుటుంబం కూడానట
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసుకు సంబంధించి మరికొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంలో అరెస్టు అయి.. జైలుపాలైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో పలువురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో అఖిలప్రియ సోదరుడు జగన్ విఖ్యాతరెడ్డి పాత్ర ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.
ఇటీవల జగత్ విఖ్యాత రెడ్డి డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు..కిడ్నాప్ ఉదంతంలో అతడి పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. సోదరి అఖిలప్రియకు సాయం అందించిన వైనానికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. అఖిలప్రియ భర్త భార్గవరామ్ తమ్ముడు చంద్రహాస్ పాత్ర కూడా ఉన్నట్లుగా భావిస్తున్నారు.
కిడ్నాప్ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి నిందితుల్ని వదిలే వరకు భార్గవ్ రామ్ కుటుంబ సభ్యులు కీలకపాత్ర పోషించినట్లుగా చెబుతున్నారు. కాల్ డేటా ఆధారంగా ఈ కొత్త విషయాల్ని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అంశాల్ని పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. ఇదిలా ఉంటే.. గురువారంతో పోలీసుల కస్టడీ ముగియటంతో.. అఖిలప్రియను న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. అంతకు ముందు వైద్య పరీక్షల్ని నిర్వహించారు. న్యాయమూర్తి ఆదేశాలతో ఆమెను చంచలగూడ జైలుకు తరలించారు.ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్గవ్ రామ్.. అతడి ముఖ్య అనుచరుడు గుంటూరు శ్రీను ఆచూకీ ఇప్పటికి వెల్లడికాలేదని చెబుతున్నారు.