ఆళ్ళ గుర్తు లేరు.. మర్రికి చోటు లేదు..
అవును ఈ ఇద్దరూ జగన్ కి వీర విధేయులు. జగన్ ముఖ్యమంత్రి కావాలని గట్టిగా కోరుకున్న వారు. ఇంకా చెప్పాలీ అంటే పార్టీలో మొదటి నుంచి ఉన్న వారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఆళ్ల రామక్రిష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్ పేర్లు వింటే వైసీపీకి వీళ్ళు కదా లీడర్లు అనిపించకమానదు. అలాంటి వారికి జగన్ హామీలు ఇచ్చారు. తరువాత మరచారు అని విమర్శలు వస్తున్నాయి.
ఇక ఆళ్ల విషయం తీసుకుంటే ఆయన మంగళగిరిలో చినబాబు లోకేష్ ని ఓడించి వైసీపీకి ప్రత్యేకించి జగన్ కి ఎంతో ఖుషీ తెచ్చారు. ఇక 2019 ఎన్నికల వేళ జగన్ మంగళగిరిలో ప్రచారం చేస్తూ లోకేష్ ని ఓడించండి, ఆళ్ళ రామక్రిష్ణారెడ్డిని మంత్రిని చేస్తాను అని గట్టిగా చెప్పారు.
దాంతో జనాలు నాటి సీఎం చంద్రబాబు కొడుకు అని చూడలేదు, స్వయంగా లోకేష్ మంత్రి అని కూడా ఆలోచించలేదు, ఆళ్ళను గెలిపించి జగన్ కి కానుక ఇచ్చారు. ఆళ్ళ కూడా అంతే పట్టుదలగా లోకేష్ మీద పోరాడారు. ఇంకేముంది ఫస్ట్ క్యాబినెట్ లోనే పదవి దక్కుతుంది అని భావించారు.
కానీ నాడు సామాజిక సమీకరణలు అని తెర తీసి ఆళ్ళకు బెర్త్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఇపుడు చూస్తే మలి విడత విస్తరణలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఆళ్లకు మళ్ళీ నిరాశ ఎదురైంది. మొత్తానికి ఆళ్ల మంత్రి కాకుండానే అయిదేళ్ళ ఎమ్మెల్యే పదవీ కాలం పూర్తి కాబోతోంది అన్నది అక్షర సత్యం.
ఇపుడు మరో నేత మర్రి రాజశేఖర్ విషయానికి వస్తే ఆయన కూడా జగన్ మీదనే కోటి ఆశలు పెట్టుకున్నారు. నిజానికి ఆయనది చిలకూరిపేట నియోజకవర్గం. అక్కడ 2018లో విడదల రజనీ వచ్చి చేరితే ఆమెకు 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు జగన్. అదే టైమ్ లో ఆమెని గెలిపిస్తే మర్రికి ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రిని కూడా చేస్తామని ప్రామిస్ చేశారు.
మూడేళ్ళు గడచినా మర్రికి ఎమ్మెల్సీ పదవి కూడా లేదు. అదే విడదల రజనీకి ప్రమోషన్ మంత్రి పదవి రూపంలో దక్కుతోంది. దీంతో మర్రి వర్గీయులు మండిపడుతున్నారు. మాట ఇచ్చి జగన్ మోసం చేశారని వారు అంటున్నారు. మరో వైపు చూస్తే ఇలాంటి మంత్రి పదవుల హామీలు చాలా మందికి జగన్ ఇచ్చినా ఇపుడు వారిని పక్కన పెట్టి సమాజిక వర్గ సమీకరణల పేరుతో వేరే వారికి ఇస్తున్నారు అన్నదే వారి ఆవేదన. మరి వైసీపీ పెద్దలు వీటిని పట్టించుకుంటారా.