తాలిబన్లను ఎదుర్కొనే ఆ ఒక్కడికి పెరుగుతున్న మద్దతు..
అప్ఘనిస్తాన్ దేశం ఇప్పుడు తాలిబన్ల చెరలో ఉంది. రేపో మాపో తమ పరిపాలనను అధికారికంగా ప్రకటిస్తారు. తాలిబన్ల పాలన గురించి తెలిసిన వాళ్లు ఇప్పటికే దేశాన్ని విడిచి వెళ్లారు. మరికొందరు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు దేశానికి అధ్యక్షుడిగా ఉన్న అప్రన్ ఘని తాలిబన్లను ఎదుర్కోలేక రెండు రోజుల ముందే వెళ్లిపోయాడు. ప్రపంచమంతా భయపడే తాలిబన్లను ఎదుర్కోవడానికి ఒక్కడున్నాడంటున్నారు. అతనే అహ్మద్ మసూద్. ఈయన తండ్రి అహ్మద్ షా మసూద్ గురించి తెలిసిన తాలిబన్ల వెన్నులో వణుకు పుడుతుంది. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు రంగంలోకి దిగబోతున్నాడు. ఆయన తాలిబన్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసిన కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. మరి అహ్మద్ మసూద్ తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతాడా..?
అప్ఘనిస్తాన్ లోని కాబూల్ నగరానికి ఉత్తరాన పంజ్ షీర్ ప్రాంతం ఉంటుంది. పంజ్ షీర్ కు చెందిన అహ్మద్ షా మసూద్ 1980లో సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా నడిచిన ఉద్యమంలో కీలకంగా ఉన్నాడు. ఆ తరువాత తాలిబన్లు ఆ సమయంలో ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోవాలని ప్రయత్నించినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. అంతేకాకుండా తాలిబన్లను పంజ్ షీర్ ప్రాంతంలోకి అడుగు పెట్టనివ్వలేదు. అయితే తాలిబన్లు 1996 నుంచి 2001 వరకు అప్ఘనిస్తాన్లో పాగా వేశారు. కానీ పంజ్ షీర్ వైపు మాత్రం వెళ్లలేదు. అటువంటి మహ్మద్ షా అసూద్ సెప్టెంబర్ 9, 2001న ఆల్ ఖైదా ఉగ్రవాదులు హత్య చేశారు. మరో కథనమేంటంటే నకిలీ విలేకరుల వేషంలో వెళ్లి ఆత్మహుతి దాడికి పాల్పడ్డారని అంటున్నారు. ఏదేమైనా ఈరోజు మాత్రం మహ్మద్ షా అసూద్ ప్రాణాలను విడిచాడు.
అహ్మద్ షా మసూద్ మరణించిన తరువాత ఆయన బాధ్యతలను కుమారడ్ అహ్మద్ మసూద్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పంజ్ షీర్ ను ఆయనే రక్షిస్తున్నారు. అయితే తాలిబన్లు మరోసారి అప్ఘినిస్తాన్లో అడుగుపెట్టిన వేళ పంజ్ షీర్ ను ఆక్రమించుకుంటారా..? లేదా..? అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు అహ్మద్ షా మసూజ్ 1980లో సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా పోరాడాడు. ఇప్పడు పరోక్షంగా తాలిబన్లకు సోవియట్ మద్దతు ఇస్తోంది. ఈ నేపథ్యంలో పంజ్ షీర్ వీటిపై యుద్ధం చేయగలడా..? అన్న ప్రశ్న ఎదురవుతోంది.
తాలిబన్లు అప్ఘాల్లో ప్రవేశిస్తున్నారని తెలియగా ఆ దేశ అధ్యక్షుడు పారిపోయాడు. కానీ ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలెహ్ మాత్రం పంజ్ షీర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అపద్ధర్మ అధ్యక్షుడిగా తానేనని అంటున్నాడు. తాలిబన్లపై తాము యుద్ధం చేస్తామని ప్రకటించాడు. అయితే అహ్మద్ మసూద్ మద్దతుతోనే అది సాధ్యమవుతుందని అంటున్నాడు. మరోవైపు అహ్మద్ మసూద్ తాలిబన్లు ఎప్పటికైనా అప్ఘనిస్తాన్ ను ఆక్రమిస్తారని ఊహించాడట. అందువల్ల ముందు జాగ్రత్తతోనే ఓ ఆయుధ ఢిపోను నిర్మించాడట. అధునాతన ఆయుధాలను అయన తెప్పించుకొని నిల్వ చేసుకున్నాడట. ఇప్పుడు వాటిని ఉపయోగించనున్నారని అంటున్నారు.
దేశాధ్యక్షుడు వెళ్లిపోయిన తరువాత మిలటరీ, పోలీసు బలగాలంతా పంజ్ షీర్ కు చేరుకున్నట్లు సమాచారం. మొన్నటి వరకు 3 లక్షల మంది ఉన్న సైన్యంలో లక్ష వరకు పంజ్ షీర్ వెళ్లారట. తాలిబన్లపై యుద్ధం చేసేందుకు వీరు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాలిబన్లకు ప్రత్యక్షంగా పాకిస్థాన్, చైనా సహకారం ఉంది. పరోక్షంగా రష్యా కూడా మద్దతు ఇస్తానంటోంది. అయితే ఈ సమయంలో భారత్, అమెరికా లాంటి దేశాలు పంజ్ షీర్ కు మద్దతు ఇస్తాయా..? లేక తాలిబన్ల విషయంలో వెనక్కి వెళుతాయా..? అన్న చర్చ సాగుతోంది. ఒకవేళ తాలిబన్లకు వ్యతిరేకంగా పంజ్ షీర్ వాసులు పోరాటం మొదలుపెడితే అసలు విషయం ఏంటనేది బయడపడుద్దని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.