పరిపూర్ణా... ఎక్కడున్నావు స్వామి

Update: 2018-12-17 15:51 GMT
ఆయన అధ్యాత్మిక గురువు.... ఆయన తన ప్రవచనాలతో పది మందికి మంచిని బోధించాల్సిన సన్యాసి. సనాతన ధర్మాన్ని తూచా తప్పక పాటీంచాల్సిన అధ్యాత్మిక వేత్త.  ఓ పీఠాన్ని ప్రారంభించి ధర్మప్రబోదాలు చేయాల్సిన ఆ‍యన ఆ మార్గాన్ని వీడారు. దాని స్దానంలో రాజకీయాలలోకి ప్రవేశించారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా. శ్రీ పీఠం ప్రారంభించి తెలంగాణ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ లో చేరిన పరిపూర్ణానంద స్వామి గురించి. ప్రవచనాల స్దానం లో ప్రసంగాలు చేసారు పరిపూర్ణానంద. తెలంగాణ రాష్ట్రం అంతటా తిరుగుతూ భారతీయ జనతా పార్టీని గెలిపించాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. ఈ ఎన్నికల లో భారతీయ జనతా పార్టీకి 70 సీట్లు వస్తాయని, తామే అధికారంలోకి వస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. తెలంగాణ లో జరిగిన ఎన్నికలలో ప్రజలు భారతీయ జనతా పార్టీ కే పట్టం కడతారని, దీనికి కేంద్రం లో తమ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలే కారణం అని పరిపూర్ణానంద తన ప్రసంగాలలో ఊదరగొట్టారు.

ముందస్తు ఎన్నికలలో ప్రచారం తర్వాత భారతీయ జనతా పార్టీ ఘోరపరాజయం పాలైంది. ఆ పార్టీ నుంచి కేవలం ఒకేఒక్క అభ్యర్ది గెలిచారు. 118 స్దానాలలో పోటీ చేసిన బిజేపీ కి దాదాపు 90 స్దానాలలో డిపాజిట్ దక్కలేదు. ఈ ఎన్నికలలో తమదే విజయం అంటూ బీరాలు పలికిన పరిపూర్ణానంద ఫలితాల అనంతరం తెలంగాణలో కనిపించకుండా పోయారు. ముందస్తు ఎన్నికల ఫలితాలపై పరిపూర్ఱానంద నుంచి ఒక్క ప్రకటన కూడా వెలవడలేదు. ఆయన ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు.

70 సీట్లతో అధికారంలోకి వస్తామని కొన్నాళ్లు, తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు లో తామే కీలకమని కొన్నాళ్లు ప్రకటించిన పరిపూర్ణానంద ప్రస్తుతం ఎక్కడున్నారో పార్టీ నాయకులకు కూడా తెలియదని అంటున్నారు. వారు కూడా సామాన్య కార్యకర్తల "పరిపూర్ణ ఎక్కడున్నావు స్వామీ" అని గాలిస్తున్నారు. తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ ఘోరపరాజయాని కి పరిపూర్ణానంద చేసిన ప్రసంగాలు కూడా కొంత కారణమని అంటున్నారు. రాజకీయాల లో కనీస అనుభవం కూడా లేని పరిపూర్ణానంద స్వామీ ఎటువంటి లెక్కలు లేకుండా ఏదిపడితే అది మాట్లడడమే పార్టీ పరాజయానికి కారణమని బిజేపీ నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News