మరదలితో అక్కమొగుడి ఎఫైర్.. వేరే వ్యక్తితో వెళ్లడంతో..
భర్తను కోల్పోయింది.. ఒంటరిగా ముగ్గురు పిల్లలతో ఉంటోంది. దీంతో ఆమె అక్క మొగుడైన బావ కన్నేశాడు. ఆ మరదలిని లోబరుచుకున్నాడు. అయితే ఆమె బావతోనే కాక మరొకరితో సన్నిహితంగా ఉండడంతో చూసి తట్టుకోలేకపోయాడు. దారుణానికి పాల్పడ్డాడు.
వరంగల్ రూరల్ జిల్లాలోని పన్యానాయక్ తండాకు చెందిన సునీత, వనిత అక్కాచెల్లెళ్లు, వనిత కొన్నేళ్ల క్రితం శంకర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. 2015లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో శంకర్ మరణించాడు. దీంతో ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న వనిత పై అక్క సునీత మొగుడు యాకూబ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
అయితే శుక్రవారం వనిత వేరే వ్యక్తితో కలిసి బైక్ పై వెళ్లడం యాకుబ్ చూశాడు. దీంతో ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుందని ఫోన్ చేసి రాయపర్తిలో ఆగమని చెప్పాడు. అక్కడి వెళ్లి ఇంటికి వెళదామని చెప్పి బైక్ పై వనితను ఎక్కించుకొని టేకులతండా శివారు పొలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో బండిలో ఉన్న స్క్రూ డ్రైవర్ తో వనితను పొడిచి చంపాడు. ఇంటికెళ్లి భార్యకు చెప్పి వనిత మృతదేహాన్ని ట్రాక్టర్ లో తరలించి ఎస్సారెస్పీ కాలువలో పడేశారు.
కాలువలో వనిత మృతదేహం గుర్తించిన పోలీసులు విచారణ జరపగా అది యాకూబ్ విషయం వెలుగుచూసింది. పోలీసుల విచారణలో యాకూబ్ నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు యాకూబ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సునీత పరారీలో ఉండడంతో గాలిస్తున్నారు. హత్యకు గురైన వనిత ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిపోయారు.