సంచలన ప్రకటన చేసిన అదర్ పూనావాలా
కరోనా థర్డ్ వేవ్ భయాలు తొలిగిపోతున్న వేళ.. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేయటం తెలిసిందే. తాజాగా దేశంలో దాదాపు రెండు డజన్ల కేసులు నమోదు కావటంతో.. కొత్త టెన్షన్ పుడుతోంది. ఇలాంటివేళ.. వ్యాక్సినేషన్ ను మరింత వేగంగా పూర్తి చేయాలన్న మాట వినిపిస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. దేశ వ్యాక్సినేషన్లలో కీలక భూమిక పోషించిన కొవిషీల్డ్ ను ఉత్పత్తి చేసిన సీరం సంస్థ సీఈవో షాకింగ్ నిజాల్ని వెల్లడించారు. కేంద్రం నుంచి తమకు తదుపరి ఆర్డర్లు లేని కారణంగా వచ్చే వారం నుంచి కొవిషీల్డ్ ఉత్పత్తిని యాభై శాతం మేర తగ్గించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా అదర్ పూనావాలా పేర్కొన్నారు.
తాజాగా ఒక జాతీయ మీడియా చానల్ తో మాట్లాడిన ఆయన.. దేశానికి భారీ మొత్తంలో స్టాక్ అవసరం అనుకుంటే.. అదనపు వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆర్డర్లు లేని కారణంగా ఉత్పత్తిని సగానికి తగ్గించామని.. ప్రభుత్వం కోరితే అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగిస్తామన్నారు.
వచ్చే ఆర్నెల్లలోపు టీకాలు అందించలేని పరిస్థితుల్లో అయితే ఉండమన్న ఆయన.. కేంద్రం 20 నుంచి 30 మిలియన్ డోసుల స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ను నిల్వ ఉంచుతోందన్నారు.
ఎక్కువ రిస్కు తీసుకోకూడదన్న ఆయన.. తాము లైసెన్సు పొందితే వెంటనే చాలా ఎక్కువ రేటుతో ఉత్పత్తి చేయగలమన్నారు. ఇక.. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ మీదా ఆయన స్పందించారు. తాజా వేరియంట్ ఇప్పటికే ఉన్న టీకాలు తీసుకున్న వారి మీద ప్రబావితం చేయటం లేదన్న మాటను ఆయన కొట్టిపారేశారు.
ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకాలు కొత్త వేరియంట్ పై పని చేయవని చెప్పటాన్ని నమ్మలేమన్నారు. అందుకు తగ్గ ఆధారాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. లాన్సెట్ జర్నల్ ప్రకారం ఆస్ట్రాజెనెకా 80 శాతం సమర్థత ఉందని తేలినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకాలు ఒమిక్రాన్ మీద అంత ప్రభావితం చేయలేవంటూ.. మోడెర్నా సంస్థ అధినేత స్టీఫెన్ హోగ్ చేసిన వ్యాఖ్యలపై అనూహ్యంగా స్పందించారు అదర్ పూనావాలా.
సరైన సమాచారం లేకుండా అంచనా వేయటం జాగ్రత్తగా ఉండాలన్న ఆయన.. మోడెర్నా అధినేత చేసిన వ్యాఖ్యలన్నీ తగినంత సమాచారం లేకుండానే ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. ‘తగినంత సమాచారం లేకుండా ఆయన చేసిన ఈ ప్రకటన వెనుక కారణాల గురించి నాకు తెలీదు.
ప్రస్తుత ప్రపంచ వ్యాక్సిన్ సరఫరా అవసరమైన దాని కంటే ఎక్కువగా ఉంది. ఆఫ్రికన్ దేశాల ప్రతినిధులతో టచ్ లోనే ఉన్నట్లుగా చెప్పారు. ఓవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తిస్థాయిలో పూర్తి కాకముందే.. కేంద్రం తన ఆర్డర్ ను సీరం సంస్థకు ఎందుకు ఇవ్వనట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.