కాంగ్రెస్ హీరోయిన్ పెళ్లికి రెడీ...!

Update: 2019-08-15 07:54 GMT
శాండిల్‌ వుడ్‌ నటి- మాజీ ఎంపీ రమ్య కొద్ది రోజులుగా రాజకీయాలకు, సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఆమె పోటీ చేసేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం శాండ‌ల్‌ వుడ్‌ లోకి హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన ర‌మ్య క‌న్న‌డంలో ప‌లువురు స్టార్ హీరోల స‌ర‌స‌న హిట్ సినిమాల్లో న‌టించింది. తెలుగులో కూడా ఆమె నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌ రామ్ స‌ర‌స‌న అభిమ‌న్యు సినిమాలో జోడీ క‌ట్టింది.

ఇక సినిమాల్లో బిజీగా ఉండ‌గానే ఆమె అనూహ్యంగా కాంగ్రెస్ త‌ర‌పున లోక్‌ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. మండ్య సీటుకు 2013లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచిన రమ్య ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే 2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆమెకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా విభాగ బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

చివ‌ర‌కు రాహుల్ ఆమెను ఏకంగా ఢిల్లీ తీసుకువెళ్లి మ‌రీ అక్క‌డ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా వార్ రూమ్ ప‌గ్గాలు అప్ప‌గించారు. లేటెస్ట్ అప్‌ డేట్ ప్ర‌కారం ర‌మ్య త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన‌ట్టు తెలుస్తోంది. ర‌మ్య కొద్ది రోజులుగా చిన్న‌నాటి స్నేహితుడు ర‌ఫెల్‌ తో ప్రేమ‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఆమె ఎప్పుడూ నోరు మెదిపింది లేదు.

ర‌మ్య ర‌ఫెల్‌ ను పెళ్లి చేసుకుని రాజ‌కీయాల‌కు, సినిమాల‌కు దూరంగా ఇండియాను వ‌దిలేసి దుబాయిలో స్థిరపడాలని నిర్ణయించకున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం ర‌మ్య పెళ్లి గురించి సోష‌ల్ మీడియాలో జోరుగా ట్రెండ్ న‌డుస్తోంది. మ‌రి దీనిపై ర‌మ్య క్లారిటీ ఇస్తే అస‌లు విష‌యం తెలుస్తుంది.








Tags:    

Similar News