• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాలకృష్ణ ఇంటి వద్ద...

బాలకృష్ణ ఇంటి వద్ద ప్రమాదం..

By - Tupaki Desk
Update: 2022-05-18 04:49 GMT
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద ప్రమాదం తప్పంది. హైదరాబాద్ లోని ఆయన ఇంటి గేట్ ను ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో గేటు స్వల్పంగా ధ్వంసమైంది.  అయితే బాలకృష్ణ ఇంటి వద్ద ప్రమాదం అనే వార్త సోషల్ మీడియాలో రాగానే తెగ వైరల్ అయింది.  ఈ ప్రమాదంతో బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఏం జరిగిందో తెలియక అటు అభిమానులు, ఇటు నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేశారు. ఇదిలా ఉండగా బాలకృష్ణ గేటును ఢీకొట్టింది ఆకతాయి కుర్రాళ్ల బైక్ లు కాదు.. ఓ అమ్మాయి నడుపుతున్న వాహనం. అసలేం జరిగిందంటే..?

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అటు రాజకీయాల్లో కొనసాగుతూ ఇటు సినిమాల్లో జోరుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఓ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన 'అఖండ' సక్సెస్ జోష్ లో ఉన్న బాలయ్య ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా షూటింగ్లో పాల్గొంటున్నాడు.

ఈ క్రమంలో బాలకృష్ణ ఎక్కువగా హైదరాబాద్లోనే ఉండాల్సి వస్తోంది. హైదాబాద్లోని జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45లో బాలకృష్ణ ఇల్లు ఉంది. ఇది మెయిన్ రోడ్డుపై ఉండడంతో ఇటువైపు వాహనాలు ఎక్కువగా రాకపోకలు సాగుతాయి. రోడ్డు పెద్దదిగా ఉండడంతో మధ్యలో డివైడర్ కూడా కట్టారు.

ఓ యువతి తన వాహనాన్ని నడుపుకుంటూ ఇటువైపు వచ్చింది. అయితే ఒక్కసారి తన వాహనాన్ని బాలకృష్ణ ఇంటిగేటువైపు దూసుకెళ్లింది. దీంతో స్థానికులు అక్కడికి గుంపులుగా చేరారు. ఆ తరువాత పోలీసులు వచ్చాయి.

అసలు విషయం విచారించగా.. ఎదురుగా వస్తున్న అంబులెన్స్ ను తప్పించబోయి వాహనాన్ని డైవర్డ్ చేశానని యువతి చెప్పింది. ఈ క్రమంలో డివైడర్ పైకి ఎక్కడి బాలకృష్ణ ఇంటి గేటు వైపు దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం కాలేదు. బాలకృష్ణ ఇంటి వద్ద కూడా ఎవరూ లేకపోవడం పెద్ద ఇబ్బందులు ఏర్పడలేదు.

కానీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో రావడంతో వైరల్ గా మారింది. బాలకృష్ణ ఇంటి వద్ద ప్రమాదం అని తెలియగానే అసలేం జరిగిందని నెట్లో తీవ్రంగా సెర్చ్ చేశారు. అయితే వాహనాన్ని యువతి నడపడం వల్ల లైట్ గా తీసుకున్నారని అంటున్నారు. అదే వేరే వ్యక్తి అయితే సమస్య పెద్దదిగా మారి ఉండేదని స్థానికులు అంటున్నారు. మరోవైపు బాలకృష్ణ ఓ రీమేక్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.






A Speeding Mahindra Thar rammed into the fence of tollywood actor and #MLABalakrishna's residence at Jubilee Hills. A woman driving the car was tested negative for drunk driving. @NewIndianXpress @HiHyderabad @Balaya_actor pic.twitter.com/HaHnHnnQbI

— R V K Rao (@RVKRao2) May 17, 2022


Tags:    
  • TollywoodActor 
  • BalaKrishna 
  • HindupuramMLA 
  • BalaKrishnaHyderabadHouse 
  • AkhandaSuccess 
  • JublieeHills 
  • GirlDriving 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS