తిరుమల వకుళామాత పోటులో ప్రమాదం .. ఐదుమందికి గాయాలు !

Update: 2020-10-24 16:30 GMT
కలియుగ వైకుంఠం తిరుమల లో తాజాగా ఓ ప్రమాదం  చోటుచేసుకుంది. తిరుమలలోని శ్రీవారి ఆలయం లో ప్రసాదాలు తయారు చేసే వకుళామాత పోటులో ప్రమాదం చోటు చేసుకుంది.  పులిహోరకు ఉపయోగించడానికి చింతపండు రసం తయారు చేస్తుండగా విద్యుత్ బాయిలర్ నుంచి ప్రెజర్ రిలీజ్ అవ్వడంతో ఐదుగురు పోటు కార్మికులు స్వల్పంగా గాయ పడ్డారు. దీనితో ఒక్క సారిగా అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.

దీనితో వెంటనే గాయపడ్డ వారిని తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రి కి తరలించారు. బాధితుల కు మెడ, వీపు, చేతులపై బొబ్బలు రావడం తో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది కార్మికులు అందులో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పోటు సూపర్ వైజర్ వరదరాజన్ మాట్లాడుతూ ప్రతి వారం రోజులకు ఒకసారి టీటీడీ అధికారులు మాస్ క్లినింగ్ చేస్తారని చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదని తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ వేంకటేశ్వర స్వామి వారు కాపాడారనీ, ఈ ఘటన ప్రమాదవ శాత్తు జరిగిందని అన్నారు. టీటీడీ మెకానిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు బాయిలర్‌ ను పరిశీలిస్తుంటారని వివరించారు. కాగా, తిరుమల శ్రీవారి ఆలయం లోకి మరింత మంది భక్తులను అనుమతించే విషయమై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే త్వరలోనే ఉచిత దర్శనాల పై కూడా కీలక నిర్ణయం తీసుకోబోతుంది.
Tags:    

Similar News