ఆధార్ లో సన్నాఫ్ తీసేస్తున్నారా? ఎందుకు?
ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా.. దేని కోసమైనా.. మీరు ఫలానా అన్నది తేలటం కోసం ఆధార్ కు మించింది లేదు. బ్యాంకు అకౌంట్ ప్రారంభం నుంచి.. మొబైల్ సిమ్ కార్డు కావాలన్నా ఆధార్ తప్పనిసరైంది. మరింత అవసరమైన ఆధార్ కార్డు లో ఏదైనా అప్డేట్ చేయించుకోవాల్సి వస్తే.. కరెక్షన్ చేసుకోవటం మామూలే. అయితే.. ఇలా మార్పులు చేసే సమయం లో ఆధార్ లో ఒక కీలకమైన మార్పు చోటు చేసుకుంటున్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డును ఒక్కసారి చూస్తే.. మొదట మీ పేరు తర్వాత సన్నాఫ్ అంటూ తండ్రి పేరు.. తండ్రి లేని వారికి డాటర్ ఆఫ్ అంటూ తల్లి పేరు ఉంటుంది. అయితే.. ఇప్పుడు ఆధార్ లో ఏదైనా మార్పులు చేసుకుంటే.. సదరు మార్పుతో పాటు.. కొత్తగా ఇష్యూ చేసే ఆధార్ కార్డులో సన్నాఫ్ ఉండాల్సిన చోట కేరాఫ్ అని ఇవ్వటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎందుకిలా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రానున్న రోజుల్లో పాస్ పోర్టులోనూ సన్నాఫ్ స్థానంలో కేరాఫ్ అంటూ మార్పు చేస్తారని చెబుతున్నారు.
ఈ మార్పు వెనుక కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయమే కారణంగా చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఉన్న విధానం ప్రకారం సన్నాఫ్.. డాటర్ ఆఫ్ అన్న స్థానే కేరాఫ్ అని మార్చటం ద్వారా.. ఎవరికి వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే.. ఎవరికి వారు వారి పౌరసత్వాన్ని నిరూపించుకోవటం కష్టమే కాదు.. క్లిష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదువుకున్న వారు.. ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి ఇలాంటి వాటి వల్ల కలిగే తలనొప్పులు తక్కువేనని.. కానీ చదువులేని నిరక్ష్య రాస్యులు.. పేదజీవుల పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు.
అసలు ఇలాంటి నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటన్న దాని మీద క్లారిటీ రావటం లేదు. అదే సమయంలో.. సంబంధిత అధికారులు నోరు విప్పటం లేదు. ఎందుకిలా చేస్తున్నారు? ఎవరు చేయమన్నారు? అన్న ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం రావటం లేదు. పైనుంచి వచ్చిన ఆదేశాలే కారణమంటున్న వారు.. దానికి సంబంధించిన అధికారిక ప్రకటనను చూపించటం లేదన్న విమర్శ వినిపిస్తోంది.
ఈ అంశంపై ఒక మీడియా సంస్థ పేర్కొన్న దాని ప్రకారం తాజాగా ఆధార్ లో ఏదైనా మార్పులు చేయించిన పక్షంలో.. కొత్తగా జారీ చేసే కార్డులో బంధుత్వం చెరిగి పోతుందని.. అందుకు తగ్గట్లుగా యుఐడీఏఐ సాఫ్ట్ వేర్ లో కేంద్రం చేసిన మార్పులే కారణాలుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని తమతో ఆధార్ కు చెందిన అధికారి ఒకరు చెప్పినట్లుగా సదరు మీడియా సంస్థ పేర్కొంది. సన్నాఫ్ స్థానంలో కేరాఫ్ రావటం వల్ల చాలానే తిప్పలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా కోర్టు కేసులు.. ఆస్తి తగాదాలు.. వీసాలు.. పాస్ పోర్టులు.. పౌరసత్వం ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఇప్పటివరకూ ఒక వ్యక్తి ఫలానా అని చెప్పే బంధుత్వం తెంచేయటం ద్వారా ఎవరికి వారు వారి ఐడెంటినీ కొత్తగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి ప్రభుత్వం జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఓకే. లేకుంటే మాత్రం తిప్పలే తప్పలంటున్నారు.