బికినీ వేసుకుందని డాక్టర్ కు షాకిచ్చారు

Update: 2019-06-20 11:39 GMT
బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ డాక్టర్ కు షాకిచ్చింది ఆ దేశ మెడికల్ కౌన్సిల్.. ఏకంగా ఆమె మెడికల్ లైసెన్స్ ను క్యాన్సల్ చేసింది. ఈ వ్యవహారం మయన్మార్ దేశంలో చోటు చేసుకుంది.

మోడల్ అవుదామనుకొని కృషి చేసిన 29 ఏళ్ల మయన్మార్ అమ్మాయి నాంగ్ మ్యూ సాన్ చివరకు డాక్టర్ అయ్యింది. కొన్ని ఏళ్లుగా డాక్టర్ గా రోగులకు సేవ చేస్తోంది. అయితే ఈ ఏడాది ఆమె బికినీ వేసుకొని ఒక ఈత కొలనులో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది. కొన్ని ఫొటో షూట్స్ లోనూ పాల్గొంది.

అయితే ఇలాంటి చేయవద్దని మొదట మయాన్మార్ మెడికల్ కౌన్సిల్ హెచ్చరించింది. ఆ ఫొటోలు తొలగించాలని.. డాక్టర్ గా ఉంటూ ఇలాంటి పనులు చేయవద్దని సూచించింది. కానీ మెడికల్ కౌన్సిల్ హెచ్చరికలను పెడచెవిన పెట్టింది. దీంతో మెడికల్ కౌన్సిల్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

మయన్మార్ మెడికల్ కౌన్సిల్ తాజాగా సాన్ మెడికల్ లైసెన్స్ ను రద్దు చేసింది. అయితే మహిళల దుస్తులు కూడా ఎలా ధరించాలో నిర్ణయించే అధికారం మయన్మార్ మెడికల్ కౌన్సిల్ కు లేదని.. ఇది దేశ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్దమంటూ సాన్ మీడియా తో మాట్లాడుతూ విమర్శలు చేసింది.  ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    

Tags:    

Similar News