ఎవరీ శాంతారామ్ బుద్న సిద్ది.. ఎందుకింత హాట్ టాపిక్

Update: 2020-07-25 05:15 GMT
అప్పటివరకూ పెద్దగా పరిచయం లేని కొందరు రాత్రికి రాత్రి పెను సంచలనంగా మారటం చూస్తున్నదే. తాజాగా శాంతారామ్ బుద్న సిద్ది అనే వ్యక్తి పేరు వైరల్ గా మారటమే కాదు.. వార్తల్లోప్రముఖంగా కనిపిస్తున్నారు. ఇతడి గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. చూసినంతనే.. విదేశీయుడిలా కనిపించే ఆయనకు సంబంధించిన ఉదంతం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆయన ఎందుకంత పాపులర్ అవుతున్నారన్నది చూస్తే.. కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఆయన్ను మండలికి నామినేట్ చేయటమే అసలు కారణం.

ఆఫ్రికా మూలాలు ఉన్న ఆయన సంఘ్ చేపట్టే గిరిజన సంక్షేమ కార్యక్రమమైన వనవాసి కల్యాణ్ ఆశ్రమం రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈ విదేశీయుడు దేశీయుడిగా ఎలా మారాడు? ఆయన గతమేమిటి? అన్న విషయాల్లోకివెళితే.. తమది ఆఫ్రికాలోని మొజాంబిక్  కానీ కెన్యా ప్రాంతానికి చెందిన వాళ్లమని.. తమ తెగ వారిని పోర్చుగీసులు బానిసలుగా చేసుకొని భారత్ కు తీసుకొచ్చారని ఆయన చెబుతారు. ఆ తర్వాత పోర్చుగీసు వారు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లే వేళలో.. తమను అలానే వదిలేయం.. వారిక్కడే ఉండిపోవటంతో వారు దేశ ప్రజల్లో భాగమయ్యారు.

శరణార్ధులుగా పశ్చిమ కనుమల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో తాము ఉండేవారిమని.. తమవారిని సిద్దిలుగా పిలుస్తారని చెబుతున్నాడు. ఈ తెగ నుంచి తొలి గ్యాడ్యుయేట్ కూడా శాంతారామ్ మాత్రమే. తమ వర్గానికి చెందిన వారు కొంకణి-మరాఠి కలిసి మాట్లాడతారని చెబుతున్నారు. తమ వారుముంబయి.. గోవా.. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో మాత్రమే కనిపిస్తారని చెబుతారు. తనను మండలికి నియమించటం ద్వారా తనపై బాధ్యత రెట్టింపు అయినట్లు పేర్కొన్నారు. తన వర్గానికే కాకుండా రాష్ట్రంలోని గిరిజనులు హక్కుల కోసం.. వారి సమస్యల మీద పోరాడతానని చెబుతున్నారు. ఇదండి శాంతారమ్ బుద్న సిద్ది బ్యాక్ గ్రౌండ్.
Tags:    

Similar News