భారత్ లో చేదు అనుభవంపై పుస్తకం రాసిన మాజీ క్రీడాకారిణి
అతిథి దేవోభవ అని అతిథులను గౌరవించే మన దేశంలో.. ఓ అతిథి అత్యాచారానికి గురయ్యింది. సాధారణ మహిళ కూడా కాదు ఆమె ఓ క్రీడాకారిణి. తనపై అనేక సార్లు కొందరు అత్యాచారానికి పాల్పడ్డారని సంచలన ప్రకటన చేసింది. ఇదంతా జరిగింది 2014లో అని వివరించింది. ఆమెనే ఆస్ట్రేలియా మాజీ సర్ఫింగ్ క్రీడాకారిణి కార్మెన్ గ్రీన్‌ట్రీ.
తనను కిడ్నాప్ చేసి ఓ వ్యక్తి కశ్మీర్‌కు తీసుకెళ్లి అక్కడ అనేకసార్లు తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. అనంతరం తాను వెళ్లిపోతానని అంటే దారుణంగా హింసించేవాడని వాపోయింది. కానీ చివరకు అతడి వల్లే ఆ నరకం నుంచి విముక్తి లభించినట్టు తెలిపింది.
ఈ విషయాలన్నింటిని ఆమె 'ఎ డేంజర్ పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్' పుస్తకంలో రాసుకొచ్చారు. భారత్‌లో తాను అనుభవించిన భయానక రోజుల నేపథ్యంలో ఆ పుస్తకం రాశారు. 2004లో తనకు 22 ఏళ్ల వయసులో దలైలామా ఆశ్రమానికి వెళ్తుండగా ఇది జరిగిందని తెలిపింది. దానికి కారణం కూడా ఆమె వివరించింది. భద్రతా పరమైన సూచనలను తాను పట్టించుకోకపోవడంతోనే తనకీ ఆ దారుణ పరిస్థితులు ఎదురయ్యాయని వెల్లడించింది. ఆ ఘటన గుర్తుకువస్తేనే ఇప్పటికీ భయంతో వణికిపోతానని తెలిపింది. ఈ సందర్భంగా పుస్తకంలో ఈ విధంగా రాసుకొచ్చారు.
‘ఢిల్లీ విమానాశ్రయంలో దిగినప్పుడు కొందరు వ్యక్తులు వచ్చి కశ్మీర్ నుంచి ధర్మశాల వెళ్లడం సులువని చెప్పడంతో వారి మాయమాటల్లో పడ్డా. రోడ్డు ప్రయాణం ద్వారా ధర్మశాలకు 14 గంటల్లో చేరుకోవచ్చని తెలిసినా ఏమాత్రం ఆలోచించలేదు. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో దిగినప్పుడు రఫిక్ అహ్మద్ డుంగూ అనే వ్యక్తి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. దాల్ సరస్సులోని హౌస్ బోట్‌లో ఓ రాత్రి ఉంటే.. తర్వాతి రోజు ధర్మశాలకు ప్రయాణ ఏర్పాటు చేస్తాడని అతడు చెప్పాడు" అని గ్రీన్‌ట్రీ తన పుస్తకంలో వివరించారు.
తన పాస్‌పోర్ట్, డాక్యుమెంట్‌లను కూడా రఫిక్ స్వాధీనం చేసుకోవడంతో తాను అతడికి లొంగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. అవి తీసుకుని హౌస్ బోట్‌లో రెండు నెలలపాటు ప్రతీ రోజూ తనపై రఫిక్ అత్యాచారం చేసే వాడని ఆ మాజీ క్రీడాకారిణి కార్మెట్ వాపోయింది. ఈ విధంగా దేశంలో పర్యటించే విదేశీయులపై కొందరు దాడులు చేస్తుండడంతో పర్యాటకంగా భారతదేశానికి అంతగా పేరు రావడం లేదు.