ఆకాశంలో షికార్లు కొట్టిన తోలి కరెంట్ విమానం!

Update: 2019-12-12 11:08 GMT
ఈ మధ్య కాలంలో ప్రతిది కూడా కరెంట్ మయం అయిపోయింది. ఎక్కడ చూసిన కరెంట్ , కరెంట్ ..తినే తిండి కూడా కరెంట్ తో తయారుచేసుకుంటున్నారు.అలాగే ఎలక్ట్రిక్ బైక్  - ఎలక్ట్రిక్ కార్  .. ఈ కోవలోనే ఇప్పుడు ఎలక్ట్రిక్ విమానం కూడా  వచ్చేసింది.  సియాటిల్ కు మ్యాగ్ని ఎక్స్ అనే కంపెనీ తోలి ఎలక్ట్రిక్ విమానాన్ని తయారు చేసింది. ఇప్పటికే  కెనడాలోని వాంకో వర్లో ఈ కరెంట్ విమానాన్ని ట్రయిల్ కూడా చేసారు. 

వాంకోవర్లోని హార్బర్ ఎయిర్ అనే సంస్థ కోసం విమానాన్ని తయారు చేసారు. ఎమిషన్స్ లేకుండా తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ఈ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుందని మ్యాగ్ని ఎక్స్ సీఈవో రోయి గాంజార్స్ కీ చెప్పారు. ఎలక్ట్రిక్ ఏవియేషన్ యుగానికి ఇదే ప్రారంభమని చెప్పారు. ఈ ఎలక్ట్రిక్ విమానం లో  ఆరుగురు ప్రయాణం చేయవచ్చు.

ఈ విమానాన్ని డీహెచ్సీ 2 డీఈ హావిలాండ్ బీవర్ సీప్లేన్ కు ఎలక్ట్రిక్ మోటార్ ని ఉపయోగించి ఈ విమానాన్ని తయారుచేసారు. హార్బర్ ఎయిర్ ఓనర్ - సీఈవో గ్రెగ్ మెక్డౌగల్ దాదాపు 15 నిమిషాల పాటు ట్రయిల్ రైడ్ చేసి  - ఆ విమానం యొక్క పనితీరుని  పరీక్షించారు.  అయితే, ఈ ఎలక్ట్రిక్ విమానాలు ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చలేవు.  ప్రయాణికులని తీసుకెళ్లే ఎలక్ట్రిక్ విమానం పూర్తిగా రెడీ అవ్వడానికి  మరో రెండేళ్ల సమయం పట్టవచ్చు అని   సీఈవో రోయి గాంజార్స్కీ తెలిపారు.
Tags:    

Similar News