ఛీ.. ఛీ.. 90 ఏళ్ల అవ్వను గ్యాంగ్ రేప్ చేసిన దారుణం

Update: 2020-11-01 09:10 GMT
ఏం పోయేకాలం? విన్నంతనే రోత పుట్టటమే కాదు.. తాను ఎందుకు బతికి ఉన్నానా? అన్న వేదన ఆ అవ్వకు కలగటం ఖాయం. చెప్పటానికి నోరు రాలేని.. రాయటానికి చేతులు ఏ మాత్రం ఇష్టపడని ఈ కిరాతకాన్ని జీర్ణించుకోవటం చాలా కష్టం. తొంభై ఏళ్ల అవ్వను సామూహిక అత్యాచారం చేసిన పైశాచిక ఘటన తాజాగా చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ ఉదంతం త్రిపురలోని కంచన్ పుర్ సబ్ డివిజన్ లో చోటు చేసుకుంది.

ఈ ఆరాచక ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. అక్టోబరు 24న ఇంట్లో ఉన్న 90 ఏళ్ల అవ్వ వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు..ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన ఫిర్యాదు పోలీసులకు అక్టోబరు 29న చేరింది. ఈ రాక్షస ఘటన తర్వాత ఆ బామ్మ అనారోగ్యానికి గురి కావటంతో పోలీసులకు ఫిర్యాదు చేయటంలో ఆలస్యమైంది.

కాస్త ఆలస్యంగా ఈ విషయం కుటుంబీకులకు తెలియటంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకరు తెలిసిన వారేకావటం.. ఆమెను బామ్మ అంటూ పిలిచేవాడని చెబుతున్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు.   ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బామ్మ వద్ద నుంచి జరిగిన ఉదంతం గురించిన సమాచారాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఇలాంటి వారిని ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి.
Tags:    

Similar News