రోడ్డు పక్కనున్న ఇన్నోవా చలానా హిస్టరీ చూసి షాక్ అయిన పోలీసులు
దేశ వ్యాప్తంగా ప్రతి రోజు మరణిస్తున్న వారిలో ఎక్కువశాతం మంది యాక్సిడెంట్స్ రూపంలోనే మరణిస్తున్నారు. సొంత తప్పిదాల వల్ల కొందరు .. ఇతరుల వల్ల కొందరు ప్రాణాలని కోల్పోతున్నారు. పోలీసులు దీనిపై ఎంతగా అవగాహనా పెంచినా ప్రజలలో మార్పు రావడంలేదు. దీనితో కేంద్రం సంచలనమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎవరైనా ట్రాఫిక్ నియమాలని ఉల్లంఘిస్తే భారీగా ఫైన్ వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మోటారు వాహన నిబంధనల సవరణ చట్టం సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఒకవైపు భారీగా ఫైన్స్ కడుతున్నా కూడా ఇంకా కొందరిలో మార్పు రావడంలేదు. కొంతమంది తమ వాహనాలకు వచ్చిన చలాన్ లని కట్టకుండా అలాగే రోడ్డుపైకి వచ్చేస్తున్నారు. ఆలా అనుకోకుండా వచ్చి ట్రాఫిక్ పోలీసులకి చిక్కన వారు ఇప్పటికే చాలామంది ఉన్నారు.
తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. కానీ , ఇక్కడ ఆ వాహనానికి ఉన్న ఫైన్ ఎంతో తెలిస్తే మాత్రం నోరెళ్లబెడతారు. పూర్తి వివరాలని చూస్తే.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇన్నోవాను చూసిన కుషాయిగూడ ట్రాఫిక్ ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తన వద్దనున్న ట్యాబ్ లో ఆ వాహనం యొక్క చలానా హిస్టరీని చెక్ చేశాడు. ఆ వాహనానికి ఉన్న చలానాని చూసి షాక్ తగిలినంత పనైంది. ఇంతకీ చలానా ఎంత ఉంది అని అనుకుంటున్నారా ..టీఎస్07 ఈబీ1115 నెంబరున్న ఇన్నోవా మీద ఏకంగా రూ.76,425 పెండింగ్ చలానాలు ఉన్నాయి.
వాహనచట్టంలో మార్పు వచ్చిన తరువాత కూడా తనకి ఇష్టం వచ్చినట్టు కారుని డ్రైవ్ చేసాడు. దీనితో కారుపై కావాల్సిన కాడికి చలానాలు వచ్చాయి.వాహనం మీద ఉన్న చలానాల్ని పట్టించుకోకుండా అలాగే తిరుగుతున్నారు. కానీ ,తప్పు చేసినవాడు ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు అన్నట్టు .. కారు ని రోడ్డుకి పక్కాగా ఆపేయడం ..అప్పుడే అటువైపు వచ్చిన ట్రాఫిక్ పోలీసులు ఆ కారు చలానా హిస్టరీని చెక్ చేయడం ..కారుని సీజ్ చేయడం చకచకా జరిగిపోయింది.
ఇక అక్కడే ఉన్న ఆ ఇన్నోవా డ్రైవర్ కు ఈ చలానా ముచ్చట చెప్పి.. వాహన యజమానికి సమాచారం ఇవ్వాల్సిందిగా చెప్పారు.దీనితో ఇన్నోవా యజమాని శ్రీనివాస్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన నేపథ్యంలో.. మరో మాట మాట్లాడకుండా ఈసేవా కేంద్రంలోకి వెళ్లి భారీగా పెండింగ్ లో ఉన్న చలానా మొత్తాన్ని చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లారు. చలానాలలో అత్యధిక భాగంగా ఔటర్ రింగు రోడ్డు మీద అతివేగంగా వెళ్లిన వాటికి సంబంధించిన చలానాలే ఎక్కువగా ఉండటం గమనార్హం.