ఓకే అడ్రస్ తో 70 పాస్‌పోర్టులు .. గుట్టు రట్టు చేసిన సీపీ సజ్జన్నార్ !
తీగ లాగితే డొంక కదిలినట్టు .. బోధన్ పాస్ పోర్ట్ కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తప్పుడు పత్రాలతో బంగ్లాదేశీయులకు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి పాస్ పోర్టులు ఇప్పించిన అవినీతి పోలీసు అధికారుల గుట్టు రట్టవుతోంది. ఈ విషయాలను ఏకంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ స్వయంగా బయటపెట్టారు. ఈ కేసులో భాగంగా ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరిలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. నలుగురు బంగ్లాదేశీయులు, ఒకరు పశ్చిమబెంగాల్, ఒకరు ఏజెంట్, ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
ఒకే చిరునామాస్ పై 32 పాస్‌పోర్టులు జారీ అవడం కలకలం రేపింది. దీనిలో ఇప్పటివరకు 72 పాస్ట్ పోర్టులు గుర్తించినట్లు వివరించారు. హైదరాబాద్ లోని కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఒకే చిరునామాపై భారీ సంఖ్యలో పాస్‌పోర్టులు ఉండడంపై ఇప్పటికే ఇమ్మిగ్రేషన్, రీజనల్ పాస్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు సజ్జనార్ తెలిపారు. ఎంతమంది దేశం దాటి వెళ్లారనేది విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు, స్థానికుల పాత్రపైనా కూడా విచారణ చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే మిగతా వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ పొందారని, ఎంతమంది దేశం దాటి వెళ్లారు, ఎంతమంది పాస్ పోర్టులు పొందారనేది విచారణ చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు.
పోలీస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పాస్ పోర్టులు జారీ అయినట్టుగా గుర్తించాం. పాస్ పోర్టుల జారీలో పోలీసుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించాము.. నలుగురు బంగ్లాదేశీయులను కూడా అరెస్టు చేశాం. తప్పుడు పత్రాలతో బంగ్లాదేశీయులు తెలంగాణలోని పలు ప్రాంతాలలో పాస్ పోర్టులు తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పాస్ పోర్టులను గుర్తించాం పాస్ పోర్టులను సీజ్ చేసి విచారించడంతో బోధన్ లింకు బయటపడింది. నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఇంకా ఎవరెవరు తప్పుడు పత్రాలతో పాస్ పోర్టులు తీసుకున్నారన్న దానిపై విచారణ జరుపుతున్నాం అని అన్నారు.