ఇంటి గోడలో 66 విస్కీ బాటిళ్లు .. షాక్ అయిన ఆ జంట!
ఓ జంట కొత్తగా ఇల్లు కొనుక్కొని, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఎన్నో ఆశలతో ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. అయితే , ఆ ఇంట్లో ఉన్న గోడల్లో ఉన్న కొన్ని వస్తువులని చూసి షాక్ అయ్యారు. పాత కాలం ఇంటి గోడల్లో విలువైన వస్తువులు, బంగారం ఉంటాయి కానీ ఇలాంటి వస్తువులు కూడా ఉంటాయా అని షాక్ అయ్యారు. ఇంతకీ వాళ్లకు గోడలో దొరికిన వస్తువులు ఏంటి అని అనుకుంటున్నారా ! ఆ గోడల్లో పురాతనకాలం నాటి విస్కీ బాటిల్స్. గోడలో లభించిన మొత్తం 66 విస్కీ బాటిల్స్ ను వారు సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ... యూఎస్ లోని న్యూయార్క్ కు చెందిన నిక్ డ్రమ్మండ్, పాట్రిక్ బక్కర్ అనే జంట గత అక్టోబర్ లో ఓ పాత ఇంటిని ఎంతో ఇష్టంగా కొనుక్కుని అందులో షిఫ్ట్ అయ్యారు. పాత ఇల్లు కొన్నారు కాబట్టి దాన్నికి రిపేర్లు చేయిద్దామనుకున్నారు. అలా రిపేర్లు చేయిస్తుండగా వారి ఇంటి గోడలో మద్య నిషేద యుగం కాలానికి చెందిన 66 విస్కీ బాటిళ్లు కనిపించాయి. వాటిని చూడగానే షాక్ అయ్యారు. ఈ జంట ఈ ఇంటిని ఓ నటోరియస్ స్మగ్లర్ దగ్గర నుంచి కొన్నారు. 100 సంవత్సరాల నాటి ఇల్లు కావటంతో దాన్ని మోడరన్ గా మారుద్దామని అనుకున్నారు. మరమత్తులు చేసే క్రమంలో ఆ ఇంటి గోడలను బాగు చేయటానికి బాగా పాడైపోయిన ఇంటి గోడల్ని తవ్వారు.ఆ తవ్వకాల్లో వారికి ఓ గోడలోపల వరుసగా పేర్చి ఉంచిన విస్కీ బాటిళ్లు కనిపించాయి. మొదటి ఓ బాటిల్ కనిపించగా అటువంటివి ఇంకా ఉండి ఉంటాయని భావించి వరుసగా గోడను తవ్వగా ఒక్కొటిగా మొత్తం 66 విస్కీబాటిల్స్ ఆ గోడలో కనిపించాయి.
ఆ తర్వాత ఆ బాటిల్స్ ఫోటోలు, వీడియోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి తెగ వైరలవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మా ఇంటిని మద్యం బాటిల్స్ తో నిర్మించారు’ అనే క్యాప్షన్‌తో ఫోటోలని ఫేర్ చేశాడు నిక్. వాటి మీద తయారీ తేదీ అక్టోబర్ 23, 1923గా ఉంది. మొత్తం 66 బాటిళ్లలో 13 ఫుల్‌గా ఉన్నాయి. మరో తొమ్మిది బాగానే ఉన్నాయి. వాటిలో నాలుగు బాటిల్స్ మాత్రం పాడైపోయాయి. మరికొన్నింటిలో విస్కీ సగమే ఉంది.Old ఇన్నేళ్లు గోడలోపల ఉండటంతో విస్కీ ఆవిరి అయి ఉండవచ్చు.