60 ఏళ్ల వయసులో లవ్వర్ తో హోటల్ లో ఫాంటసీ.. షాకింగ్ ట్విస్టు ఏమంటే?

Update: 2022-05-24 02:33 GMT
లేటు వయసులో ఘాటు ప్రేమ తరహాలో.. పెద్ద వయస్కుడు ఒకరు అనుకోని రీతిలో చేసిన ఒక పని ఆయన ప్రాణాల్ని తీసిన విషాద ఉదంతం ఒకటి ముంబయిలో చోటు చేసుకుంది. అరవై ఏళ్ల యవసులో తన నలభై ఏళ్ల లవ్వర్ ను తీసుకొని హోటల్లో ఏకాంతంగా రొమాన్సు చేస్తున్న వేళ.. హటాత్తుగా అపస్మారక స్థితిలోకి జారిపోయిన ఉదంతం చోటు చేసుకుంది. ఆ వెంటనే అతడ్ని హోటల్ నుంచి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్లుగా వైద్యులు పేర్కొన్న వైనం షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

ముంబయికి చెందిన 61 ఏళ్ల వ్యక్తి వర్లీలో నివాసం ఉంటున్నాడు. ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న అతడికి నలభై ఏళ్ల లవ్వర్ ఉంది. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉండటం.. తాజాగా ఒక హోటల్ కు వెళ్లి ఎంజాయ్ చేయాలని భావించారు. అందులో భాగంగా వారిద్దరు కుర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్లో రూం తీసుకున్నారు. తన ప్రియురాలితో సెక్సు చేస్తున్న వేళ.. అతను హటాత్తుగా అపస్మారక స్థితిలోకి జారిపోయాడు. దీంతో కంగారుపడిన మహిళ హోటల్ యాజమాన్యానికి విషయాల్ని తెలిపింది.
Read more!

వెంటనే స్పందించిన సిబ్బంది.. అతడ్నిదగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే మరణించినట్లుగా వైద్యులు చెప్పటంతో.. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.దీంతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని కుర్ల స్టేషన్ కు తరలించారు. అక్కడ ఆమెను విచారించారు. ఈ సందర్భంగా జరిగిన వివరాల్ని తెలియచేస్తూ.. సెక్సు చేసే సమయంలో అతగాడు డ్రింక్ చేసే ప్రయత్నం చేశాడని.. ఆ సమయంలోనే హటాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లుగా ఆమె పోలీసులకు తెలిపారు.

అయితే.. సెక్సుకు ముందు ఏదైనా పిల్ తీసుకొని ఉంటారా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. సదరు వ్యక్తి పోస్టు మార్టం రిపోర్టు వస్తే మరింత క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. లేటు వయసులో కోరికల్ని తీర్చుకునే విషయంలో జాగ్రత్తలు పాటించకుంటే.. ప్రాణాల మీదకు రావటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
Tags:    

Similar News