• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డ్రాగన్ దేశంల 5జీ సేవల...

డ్రాగన్ దేశంల 5జీ సేవల లెక్కలు బయటకొచ్చేశాయ్

By - Tupaki Desk
Update: 2019-11-01 04:37 GMT
4జీ ఇప్పుడిప్పుడే సాధారణ ప్రజలకు సైతం వంటపడుతున్న వేళ.. దానమ్మ మొగుడుగా చెప్పే 5జీ సేవలు కొన్ని దేశాల్లో ఇప్పటికే మొదలయ్యాయి. పొరుగున ఉన్న డ్రాగన్ దేశంలో ఈ రోజు నుంచి 5జీ సేవల్ని దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. చైనాలోని ప్రముఖ టెలికాం ఆపరేషర్లు ముగ్గురు 5జీ సేవల్ని చైనాలోని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేశారు.

 చైనాలో అతి పెద్ద టెలికాం ఆపరేటర్ అయిన చైనా మొబైల్ అయితే బీజింగ్.. షాంఘై.. షెంజాన్ తదితర యాభై నగరాల్లో 5జీ సేవల్ని అందించేందుకు సిద్ధమైంది. దాని ప్రత్యర్థి కంపెనీలైన చైనా టెలికం.. చైనా యూనికామ్ లు కూడా 5జీ బాట పట్టాయి. 4జీతో పోలిస్తే.. వంద రెట్లు వేగంగా పని చేసే 5జీ పుణ్యమా అని మొబైల్ సేవలతో పాటు.. మరిన్ని టెలికాం సేవల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.

డేటా డౌన్ లోడ్ విషయంలో 5జీ స్పీడ్ ఎంతంటే.. ఒక సినిమాను డౌన్ లోడ్ చేసుకోవటానికి కొన్ని సెకన్లలోనే పూర్తి చేసే పరిస్థితి. అంతేకాదు.. మొబైల్ యాప్స్ ను సైతం వర్చువల్ రియాలిటీలో ఉపయోగించుకునే వీలుతో పాటు.. నెట్ ఆధారిత పనుల విషయంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. వేగం సంగతి బాగానే ఉంది.. నెలవారీగా అయ్యే బిల్లు సంగతేమంటారా? అక్కడికే వస్తున్నాం. చైనాలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్ చైనా మొబైల్ వారు తాము అందించే 5జీ సేవల్ని వినియోగించుకోవాలంటే నెలకు దగ్గర దగ్గర 18 యూఎస్ డాలర్ల వరకూ చార్జ్ చేస్తున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే.. 1277 చెప్పాలి. దానితో పోటీ పడుతున్న ఇతర నెట్ వర్క్ లు కూడా ఇంచుమించే ఇంతే ఛార్జ్ ను వసూలు చేస్తున్నాయి. ఇంత భారీ ఛార్జీలతో మనోళ్లు 5జ సేవల్ని వినియోగించటానికి సిద్ధంగా ఉండరని చెప్పక తప్పదు.

5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో డ్రైవర్ రహిత కార్లు.. ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్.. ఇంటర్నెట్ ఉపయోగించి ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ ఉపకరణాల్ని వినియోగించే వీలు ఉంటుందని చెబుతున్నారు. మరి.. ఈ సేవలకు చైనాలో ఆదరణ ఎంత ఉంటుందన్న విషయానికి వస్తే. ఏడాది వ్యవధిలో 170 మిలియన్ల కస్టమర్లు 5జీ సేవల్లోకి కన్వెర్ట్ అవుతారన్న అంచనా వినిపిస్తోంది.
Tags:    
  • 5G Services 
  • Started 
  • China 

Similar News

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS