అణ్వాయుధ నిషేధానికి 50 దేశాల ఆమోదం

Update: 2020-10-26 04:30 GMT
ప్రపంచ శాంతి కోసం అణ్వాయుధాలను అగ్రదేశాలు వదులుకోవాలని పౌరహక్కుల సమాజం, ఐరాస, హక్కుల నేతలు ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు వారి ఆకాంక్షలు నెరవేరే రోజు రానే వచ్చింది. ఐరాసలోని 50 సభ్యదేశాలు నిషేధిత ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో ఈ 50 దేశాలు ఇక అణ్వాయుధాలను నిషేధించినట్టే. ఇదొక గొప్ప పరిణామంగా చెప్పవచ్చు.

అణ్వాయుధాల నిషేధిత ఒప్పందానికి ఇప్పటివరకు 50 దేశాలు ఆమోదం తెలిపినట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీంతో వచ్చే మూడు నెలల్లోనే ఈ ఒప్పందం అమలులోకి రానుంది. ఈ అంతర్జాతీయ ఒప్పందానికి 50 దేశాలు ముందుకు రావడం చారిత్రక మైలురాయిగా ఐరాస అభివర్ణించింది.

ఈ సందర్భంగా ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ మాట్లాడుతూ..  దీనివల్ల ప్రపంచాన్ని మేల్కొలపడం మరింత సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2021 జనవరి 22 నుంచి ఈ అణ్వాయుధ నిషేధం అమలులోకి వస్తుంది.

అయితే అమెరికాతోపాటు అణ్వాయుధాలు కలిగిన శక్తిమంతమైన దేశాలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యాలు కూడా ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని అమెరికా పట్టుబడుతోంది.
Tags:    

Similar News