నోకియాలో 42 మందికి వైరస్ ..ప్లాంట్ మూసివేత !

Update: 2020-05-27 07:00 GMT
మహమ్మారి భయంతో లాక్ ‌డౌన్ విధించటంతో ఇప్పటికే దేశ వ్యాప్తంగానేకాదు ప్రపంచ వ్యాప్తంగా సంస్థలన్నీ మూతపడ్డాయి. లాక్‌ డౌన్ సడలింపుల్లో భాగంగా..ఇప్పుడిప్పుడే తిరిగి తెరుచుకుంటున్నాయి. అయితే,  ఈ  నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై సమీపంలోని శ్రీ పెరంబుదూర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ మొబైల్ కంపెనీ నోకియా ప్లాంటును మళ్లీ మూసివేశారు. ఫ్యాక్టరీలో సిబ్బందికి కరోనా సోకడంతో ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

అయితే ఎంతమందికి వైరస్ సోకిందన్న విషయాన్ని వెల్లడించలేదు. అయితే, కనీసం 42 మందికి వైరస్ సోకిందని  విశ్వసనీయ వర్గాల సమాచారం.  లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో సంబంధిత నిబంధనల ప్రకారం ఇటీవల ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించామని, భౌతిక దూరం, క్యాంటీన్ లో మార్పులు లాంటి  నిబంధనలను పాటిస్తున్నామని నోకియా ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే  తాజా పరిణామం నేపథ్యంలో పరిమిత సిబ్బందితో  మరికొద్ది రోజుల్లోనే  తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది.  కాగా, చైనా స్మార్ట్ ‌ఫోన్ తయారీ సంస్థ OPPO లాక్ డౌన్ సడలింపుల తర్వాత గత వారం ఢిల్లీలోని ప్లాంట్ ను ప్రారంభించింది.  ఈ కంపెనీలో ఉన్న మూడు వేలమందికిపైగా ఉన్నారు. వీరిలో ఆరు నుంచి తొమ్మిది మందికి కరోనా సోకడంతో  ప్లాంట్‌లో కార్యకలాపాలను గత వారం నిలిపివేసిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News