సీబీఐ పేరు చెప్పి 45 కిలోల బంగారం చోరీ

Update: 2016-12-28 07:35 GMT
హైద‌రాబాద్ - ప‌రిస‌ర ప్రాంతాల్లో దోపిడీ దొంగ‌ల అరాచ‌కాలు పెరిగిపోతున్నాయి. తాజాగా సీబీఐ పేరు చెప్పి 45 కిలోల బంగారం దోచుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడ ముత్తూట్‌ ఫైనాన్స్ లో భారీ దోపిడికి పాల్ప‌డ్డారు. సీబీఐ అధికారులమంటూ లోప‌లికి వ‌చ్చిన దుండ‌గులు లాక‌ర్ల‌ను ప‌రిశీలించాల‌ని ముత్తూట్ ఉద్యోగుల‌కు తెలిపారు. అయితే  ఉన్న‌తాధికారులు లేన‌పుడు తాము లాక‌ర్లు చూసేందుకు అనుమ‌తించ‌మంటూ ఉద్యోగులు స‌హ‌క‌రించక‌పోయిన‌ప్ప‌టికీ వారిని బెదిరించారు. దీంతో లాక‌ర్లు ప‌రిశీలించే అవ‌కాశం క‌ల్పించ‌గా...వాటిని చూస్తున్న‌ట్లుగా న‌టించి బంగారం దోచుకున్నారు.

ఈ స‌మ‌యంలో ముత్తూట్ ఉద్యోగులు వ్య‌తిరేకించ‌డంతో తుపాకులతో ఉద్యోగుల‌ను బెదిరించి బాత్ రూంలో బంధించి దోపిడీకి పాల్ప‌డ్డారు. దుండగుల త‌మ ఆనవాళ్లు దొరకకుండా సీసీ కెమెరాలు తొలగించి దోపిడీ చేశారు. కాగా ఈ ప‌రిణామంపై సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా స్పందించారు. ముత్తూట్ ఫైనాన్స్ లో 45 కిలోల బంగారం చోరీ అయ్యిందని, వీటి విలువ సుమారు 12 కోట్లు అని తెలిపారు. సీబీఐ అధికారులమ‌ని చెప్పి దోపిడీ చేశారని చెప్పిన పోలీస్ క‌మిష‌న‌ర్ నిందితుల కోసం మెదక్ సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని ప్ర‌క‌టించారు. రెడ్ కలర్ స్కార్పియోలో  నిందితులు పారి పోయారని వారిని ప‌ట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామ‌ని ప్ర‌క‌టించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News