పేటియం, అమెజాన్ వంటి 30వేల వెబ్‌సైట్లు డౌన్ .. కారణం ఏంటంటే ?

Update: 2021-07-23 04:34 GMT
ప్రస్తుతం ఆధునిక యుగానికి అందరం ఎంతగా అలవాటు పడిపోయామో అందరికి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాకా, మనకి కావాల్సింది ఏదైనా కూడా మన ఇంటి తలుపు ముందుకు వచ్చేస్తోంది. పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనకి ఏ అవసరం వచ్చినా కూడా దానికి సంబంధించిన మొబైల్ యాప్ అనేది స్మార్ట్ ఫోన్ లో ఉంటుంది.

ఆ యాప్ లోకి వెల్లడం ఆర్డర్ చేస్తే చాలు క్షణాల్లో మన గేట్ ముందుకి వచ్చేస్తోంది. ఇక జొమోటో , స్విగ్గి వంటి యాప్స్ వచ్చిన తర్వాత బిజీ లైఫ్ గడిపే వారికి ఫుడ్ సమస్య తీరిపోయింది. అలా ఆర్డర్ పెట్టుకోవడం ..ఇలా తినేయడం. అయితే , ఏదైనా సమస్య వల్ల ఒక నిముషం ఆ యాప్స్ పనిచేయకుండా పోయినా కూడా పెద్ద ప్రాబ్లెమ్ వచ్చి పడుతుంది. అలాంటిది ఏ ఒక్క యాప్ కాదు ఏకంగా 30 వేల యాప్స్ ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. అసలు ఆ వెబ్ సైట్స్ డౌన్ కావడానికి అసలు కారణం ఏమిటంటే.. ఆ  వెళ్తే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో  పాపులర్ అయిన అమెజాన్, జొమాటో, పేటియం, ప్లేస్టేషన్ నెట్‌ వర్క్, ఫెడెక్స్, స్టీమ్, యూపీఎస్, ఎయిర్‌ బీఎన్‌ బీ, హోండిపో , డిస్నీ హాట్ స్టార్  వంటి సుమారు 30వేల ప్రముఖ వెబ్‌ సైట్లు ఒక్కసారిగా గా డౌన్ అయ్యాయిఅయితే , ఆ తర్వాత దాని సమస్య ఏమిటో కనిపెట్టి , దాన్ని తొలగించడం తో మళ్లీ యధావిధిగా ఆ వెబ్ సైట్స్ అందుబాటులోకి వచ్చాయి.  వెబ్ పర్యవేక్షణ సైట్ డౌన్ డిటెక్టర్ నివేదికల ప్రకారం గురువారం మధ్యాహ్నం తర్వాత కొంచెం కొంచెం గా ఈ సమస్య ప్రారంభమైంది.

ఇన్ని ప్రముఖ వెబ్ సైట్స్ మొత్తం  భారీ సాంకేతిక సమస్య వల్లే ఇలా ఒక్కసారిగా డౌన్ అయినట్లు సమాచారం. డొమైన్ నేమ్ వ్యవస్థ(డీఎన్ ఎస్)లో వచ్చిన ఒక సమస్య వల్ల కనీసం 29వేల ప్రముఖ వెబ్‌ సైట్లు, యాప్స్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. డీఎన్ ఎస్ సమస్య వల్లే కొంతసేపు ఈ ప్రముఖ వెబ్‌ సైట్లు, యాప్స్ అన్నీ పనిచేయలేదని సమాచారం. ఈ విషయాన్ని క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అకామై టెక్నాలజీస్  వెల్లడించింది. ఈ సమస్యను తాము పరిష్కరించామని, ఈ వెబ్‌ సైట్లన్నీ మళ్లీ సాధారణంగా పనిచేస్తున్నాయని వెల్లడించింది.
Tags:    

Similar News