24శాతం మంది ఎంపీలు క్రిమినల్స్ యేనా?

Update: 2020-07-23 06:15 GMT
క్రిమినల్స్ జైల్లో ఉండాలి.. నీతిమంతులు చట్టసభల్లో ఉండాలని ప్రసంగాల్లో వింటుంటాం.. కానీ మన దేశంలో ట్రెయిన్ రివర్స్.. మంచిగా ఉంటే ఈ సమాజంలో బతకడం కొంచెం కష్టమేనన్న వాదన ఉంది. మోసం చేసేవారు ఎక్కువగా ఉండడంతో కాస్తా జాగ్రత్తగా ఉండాలి. కానీ మన చట్టసభలు చూస్తే ఇప్పుడు క్రిమినల్ కేసులు నమోదైన వారే ఎక్కువగా ఉండడం గమనార్హం.

పార్లమెంట్ లో కూర్చొని ప్రసంగాలు ఉదరగొడుతూ నీతులు చెప్పే మన ఎంపీల్లో 24శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ స్పష్టం చేసింది.

ముఖ్యంగా పెద్దల సభ అయిన రాజస్యభ అంటే దేశంలోని మేధావులు.. వృద్ధ జంబూకాలు కొలువైన సభ. ఆ సభలో కూడా క్రిమినల్ కేసులున్న వారి సంఖ్య ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఎంపీల ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలించగా.. ఆర్జేడీ ఎంపీల్లో 80శాతం మందిపై కేసులు ఉన్నాయని ఏడీఆర్ సంస్థ సర్వేలో తేలింది.

ఆమ్ ఆద్మీ, శివసేన ఎంపీల్లో 67శాతం మందిపై కేసులు ఉన్నాయని సర్వేలో తేలింది. ఇక వైసీపీ, ఎన్సీపీ, సీపీఎం ఎంపీల్లో 50శాతం మందిపై కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. 
Tags:    

Similar News