ఉద్యోగం కంటే అడుక్కోవడం బెటరంటున్నారు
ఇండియాలో యాచన పెద్ద ప్రొఫెషన్ గా మారిపోయింది. సాఫ్టువేరు ఇంజినీర్ల జీతాల కంటే కొందరు యాచకుల సంపాదన ఎక్కువగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇండియాలో యాచకులకు సంబంధించిన విషయాలు వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. జనాభా లెక్కల్లో వెలుగు చూసిన వివరాలు వింటే ఆశ్చర్యపోతాం. దేశంలో మొత్తం 3.72 లక్షల మంది యాచకులు ఉంటే అందులో ఇంటరు పూర్తి చేసినవారు 21 శాతం మంది ఉన్నారట. పీజీ పూర్తి చేసినవారు, డిప్లమో చదివినవారు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రాకపోవడంతో విసిగి ఈ పని చేస్తున్నారట చాలామంది.
సరైన ఉద్యోగాలు దొరక్క చిన్నాచితకా పనులు చేసినా బతుకీడ్చలేకపోవడంతో యాచన చేసుకుంటున్నట్లు ఎక్కువ మంది చెప్తున్నారు. ఇండియాలోని యాచకుల్లో ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడేవారి సంఖ్య వేలల్లో ఉండడం విశేషం.
కాగా ఈ గణాంకాలు వెల్లడైన తరువాత సామాజికవేత్తలు ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిరుద్యోగ సమస్యకు ఈ గణాంకాలు నిదర్శనమని పేర్కొంటూ మండిపడుతున్నారు.