కరోనా హాట్‌ స్పాట్స్ .. సంచలన నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సర్కార్ ..ఏంటంటే ?

Update: 2020-04-09 06:15 GMT
దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఢిల్లీలో  పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.  ఢిల్లీలో  19  హాట్‌ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలను  పూర్తిగా దిగ్బంధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. వందలాది కుటుంబాలు నివసించే అపార్ట్‌ మెంట్లు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. వాటన్నింటికీ రాత్రికి రాత్రి తాళం వేసింది ప్రభుత్వం. కంటైన్‌ మెంట్లు జోన్లుగా ప్రకటించింది. ఒక్క మనిషి కూడా బయటికి రానివ్వకుండా గేట్లను మూసివేయించింది. అలాగే ఆ అపార్ట్‌మెంట్ల బయట పోలీసులతో పహారాను ఏర్పాటు చేసింది.

మయూర్ విహార్ ఫేస్-1 ఎక్స్‌ టెన్షన్ పరిధిలోని వర్ధమాన్ అపార్ట్‌ మెంట్, పాండవ్ నగర్‌ లోని ఐపీ ఎక్స్‌ టెన్షన్‌ లో గల మయూర ధ్వజ అపార్ట్‌ మెంట్లను కరోనా వైరస్ హాట్‌ స్పాట్‌ గా గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. బయటికి వెళ్లడానికి వీలు లేకుండా అన్ని దారులని మూసేసారు.  ఈ రెండు అపార్ట్‌ మెంట్లను కంటైన్‌ మెంట్ జోన్లుగా మార్చినట్లు నోటీసులను అతికించారు.
Read more!

కంటైన్‌ మెంట్ జోన్లుగా గుర్తించిన నేపథ్యంలో.. అపార్ట్‌ మెంట్ వాసులు రోడ్ల మీదికి రాకుండా పూర్తిగా నిషేధాన్ని విధించారు. వారికీ అవసరమైన పాలతో సహా నిత్యావసర సరుకులను కూడా ఇంటి వద్దకే సమకూర్చుతున్నారు. ఈ నిర్బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేమని, కరోనా మహమ్మారి కట్టడిలోకి వచ్చే వరకు ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేమని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. తబ్లిగి జమాత్ మత ప్రార్థనలకు వేదికగా మారిన నిజాముద్దీన్ మర్కజ్ సహా మొత్తం 19 ప్రాంతాలను హాట్‌స్పాట్లు గా గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం ..వాటిల్లో కొన్నింటిని కంటైన్‌ మెంట్ జోన్లుగా ప్రకటించింది.
Tags:    

Similar News