• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమ్మ డ్రైవ‌ర్ అకస్మిక‌...

అమ్మ డ్రైవ‌ర్ అకస్మిక‌ మ‌ర‌ణంలో ఇంకో ట్విస్ట్‌

By - Tupaki Desk
Update: 2017-04-30 05:53 GMT
అన్నాడీఎంకే అధినేత్రి తమిళనాడు దివంగ‌త సీఎం జయలలితకు చెందిన డ్రైవ‌ర్ హ‌త్య‌లో  మ‌రో ట్విస్ట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. అమ్మ‌కు చెందిన  కొడనాడు టీ ఎస్టేట్ బంగ్లా సెక్యూరిటీ గార్డు హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎస్ కనకరాజు శుక్రవారం రాత్రి ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. అయితే అతడి స్నేహితుడు - ఈ కేసులో మరో నిందితుడు అయిన‌ శ్యామ్ కేరళలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు ప్రమాదాలు ఒకేరాత్రి కొన్ని గంటల వ్యవధిలో ఇద్ద‌రు నిందితులు రోడ్డు ప్రమాదంలోనే చ‌నిపోవ‌డంపై పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

ఏప్రిల్ 24వ తేదీ రాత్రి నీలగిరి సమీపంలోని జయలలిత ఎస్టేట్ బంగ్లా సెక్యూరిటీ గార్డుగా ఉన్న నేపాల్‌ కు చెందిన ఓమ్ బహదూర్ హత్య - దోపిడీ కేసులో కనకరాజు కీలక సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలోని సాలెం జిల్లా అతూర్‌ లో కనకరాజు (36)నడుపుతున్న బైక్‌ ను కారు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని పోలీసులు అత్తూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కనకరాజ్ సన్నిహిత మిత్రుడు సాయన్ అలియాస్ శ్యామ్ శనివారం తెల్లవారుజామున కారులో కుటుంబంతో కలిసి త్రిసూర్ నుంచి కోయంబత్తూర్ వెళ్తుండగా లారీ వీరి కారును ఢీకొట్టింది. పాలక్కడ్-త్రిసూర్ రోడ్డు పై జరిగిన ఈ ప్రమాదంలో శ్యామ్ భార్య వినుప్రియ - కూతురు నీతు అక్కడికక్కడే చనిపోయారు. శ్యామ్ తీవ్రంగా గాయపడ్డారు. దవాఖానలో చికిత్స పొందుతున్న శ్యామ్ నుంచి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎస్ సెంథిల్‌ కుమార్ వాంగ్మూలం తీసుకున్నారు.

2012 వరకు జయలలిత కారు డ్రైవర్‌ గా కనకరాజు పనిచేశారు. నీలగిరికి సమీపంలోని టీ ఎస్టేట్ బంగ్లాకు జయలలిత తరచూ వెళ్లేవారు. ఆ బంగ్లాలో జయలలితకు సంబంధించిన కీలకపత్రాలు ఉంటాయని, వాటిని ఎత్తుకురమ్మని ఏప్రిల్ 24 రాత్రి కొందరు రెండు సుమో వాహనాల్లో పది మందిని పురమాయించినట్టు పోలీసులు అనుమానించారు. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఆ రాత్రి బంగ్లాకు చేరుకున్న దుండగులు సెక్యూరిటీ గార్డును హత్యచేసి, మరొకరిని తీవ్రంగా గాయపరిచి కీలకపత్రాలు ఎత్తుకెళ్లారు. వీరిలో కీల‌క నిందితులుగా క‌న‌క‌రాజు - శ్యామ్‌ ల‌ను అనుమానిస్తున్నారు. కాగా, జయ అక్రమ ఆస్తుల కేసులో ఈ బంగ్లా ప్రస్తావన కూడా ఉంది. ఈ కేసులో జయలలిత, శశికళతోపాటు పలువురు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Security guard 
  • Jayalalitha estate 
  • Accidents 
  • Telugu News 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS