17 ఏళ్ల వయస్సులోనే ముగ్గురితో ప్రేమ..ఆ ముగ్గురితో కూడా..!
ప్రేమ పేరు చెప్పి అమ్మాయిలని నమ్మించి మోసం చేయడం అనేది ఈ మధ్య రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే , అమ్మాయిలు , అబ్బాయిలు ఓ వయస్సు వచ్చాక ఏం చేస్తున్నామో కూడా మర్చిపోయి ప్రవర్తిస్తుండటంతో ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ, పెళ్లి పేరుతో సంబంధాలు పెట్టుకుని ఏకంగా ముగ్గురు బాలికలను మోసం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో బుధవారం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన గురించి వెళ్తే .. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు మొదట ఓ 16 ఏళ్ల వయస్సు ఉన్న బాలిక కు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఆ సంబంధం అలా కొనసాగిన కొన్ని రోజుల తర్వాత ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో అతన్ని గట్టిగా మందలించగా, వారికి కొంత డబ్బు చెల్లించి బాలికతో తెగదెంపులు చేసుకున్నాడు. ఆ తర్వాత 14 ఏళ్ల మరో బాలికకు ఇలాగే ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెతోనూ శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఆమెతో సంబంధం కొనసాగిస్తూనే 17ఏళ్ల మరో బాలికను తన వలలో పడేశాడు.
ఇలా ఒకేసారి ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన మూడో బాలిక ఇటీవల నేరుగా అతని ఇంటికి వెళ్లి నిలదీసింది. తనను మోసం చేశావని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అతను నీళ్లు నమిలాడు. బాలిక కుటుంబ సభ్యులు అతనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అమాయక ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆ బాలుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఆ బాలుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు మొదట పక్క గ్రామానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో వంచించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇది ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో కొంత డబ్బు చెల్లించి తెగతెంపులు చేసుకున్నాడు. తరువాత మరో బాలిక తో శారీరక సంబంధం పెట్టుకుని, ఇంకో బాలిక ను పెళ్లి చేసుకుంటానంటూ దగ్గరయ్యాడు. అనుమానంతో మూడో బాలిక బాలుడి ఇంటికే రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాలుడు, మూడో బాలిక కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని ఎస్సై రవి తెలిపారు.