బీఅలెర్టు.. హైదరాబాద్ లో ఆ కాలేజీలో అన్ని కేసులు
ఒక ఊపు ఊసేసిన కరోనా.. కొంతకాలంగా తన జోరును కాస్త తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే.. తగ్గటం.. ఆ తర్వాత పెరగటం కోసమే అన్నట్లుగా ఉంది కొవిడ్ తీరు చూస్తే. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి.. ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే.. మన దేశంలోనూ కరోనా కేసులతో పాటు.. ఒమిక్రాన్ కేసులు సైతం అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
కేసులు పెరుగుతున్న వేళ.. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్ని చూసినప్పుడు.. అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. దీనికి తోడు ప్రభుత్వాల చర్యలు కూడా.. ప్రజల్ని నియంత్రించేలా ఉండకపోవటం ఆందోళన కలిగిస్తుంది. ఇదే తీరులో సాగితే.. ఫిబ్రవరిలో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.
ఇందుకు తగ్గట్లే ఒక ఉదంతం తెలంగాణలోని హైదరాబాద్ మహా నగరంలోని ఒక ప్రైవేటు కాలేజీలో చోటు చేసుకున్నఒక ఉదంతం షాకింగ్ గానే కాదు.. ప్రజలంతా ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని తెలియజేసేలా ఉంది.
విచిత్రమైన విషయం ఏమంటే.. ఈ కాలేజీలో ఒకే రోజులో బయటకు వచ్చిన పద్నాలుగు కేసుల గురించి మీడియాలో ఎక్కువగా ఫోకస్ కాకపోవటం గమనార్హం. ఒక ప్రముఖ విద్యా సంస్థకు చెందిన చైన్ విద్యా సంస్థలో పద్నాలుగు మంది విద్యార్థులకు కరోనా సోకటం.. మీడియాలో వాటికి సంబంధించిన వార్తలు ఏమీ లేకపోవటం చూస్తే.. విస్మయానికి గురి కాక మానదు.
నిజానికి.. కరోనా కేసుల తీవ్రత గురించి మీడియాలో ఎంత ఎక్కువ సమాచారం వస్తే.. ప్రజలు అంత అప్రమత్తంగా ఉండటంతో పాటు.. ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించే వీలుంది. కానీ.. ఇలాంటి వాటి గురించిన సమాచారాన్ని ప్రముఖంగా ఇవ్వకపోవటం ద్వారా.. వాస్తవ పరిస్థితి ఏమిటన్న విషయం తెలిసే వీల్లేదు. ఇది ప్రమాద తీవ్రతను మరింత పెంచేలా చేస్తుందన్నది మర్చిపోకూడదు.
ఒక ప్రముఖ ప్రైవేటు విద్యా సంస్థలో 14 మంది విద్యార్థులకు ఒకేరోజున కరోనా కేసులు బయటపడితే.. వాటికి కారణమైన వారెంత మంది ఉంటారు? ఈ విద్యార్థులు కాంటాక్టు అయిన వారిలో పాజిటివ్ ఎంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. కేసుల నమోదు సంఖ్య అయితే ఎక్కువ అవుతున్నాయి. మరింత. అప్రమత్తంగా లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాదీయులు పారాహుషార్.