ఖైదీలకు గుడ్ న్యూస్.. 126 మంది విడుదల
గాంధీ జయంతి సందర్భంగా ఏటా దేశంలోని పలు జైళ్లలో మగ్గుతున్న ఖైదీల్లో సత్ ప్రవర్తన చూపించే వారిని వందల సంఖ్యలో విడుదల చేయడం ఆనవాయితీ. ఈ సారి కూడా అక్టోబర్ 2న ఖైదీలను విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో మగ్గుతున్న ఖైదీలకు హోంశాఖ గుడ్న్యూస్ చెప్పింది.తెలంగాణ రాష్ట్రంలో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న 126 మంది ఖైదీలకు క్షమా భిక్ష ఇచ్చేశారు. వీరంతా తమ ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర హోంశాఖ బుధవారం జీవో నంబర్ 30ని విడుదల చేసింది.
హోంశాఖ కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, లా సెక్రటరీ సంతోష్, జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది హాజరై అక్టోబర్ 2న ఖైదీల క్షమాభిక్షపై చర్చించారు. దీంతో ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ద ఖైదీల క్షమాభిక్ష ఫైల్ హోం శాఖ నుంచి సీఎం చంద్రశేఖరరావు వద్దకు వెళ్లింది. సీఎం సంతకం అయిన వెంటనే ఆ ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్లనుంది. గవర్నర్ సంతకం అయిన వెంటనే అక్టోబర్ 2న క్షమాభిక్షపై 126 మంది ఖైదీలకు విముక్తి లభిస్తుంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవో తో అనేక సంవత్సరాలుగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు ఉపశమనం లభించనున్నది. అయితే సత్ఫ్రవర్తన కింద, వయసు మళ్లిన వారిని దృష్టిలో పెట్టుకుని హోంశాఖ వీరిని విడుదల చేసింది.