ప్రేమించి పెళ్లి ప్రేమికుడు దారుణ హత్య .. 12 మంది అరెస్ట్ !

Update: 2020-09-25 10:50 GMT
హైదరాబాద్‌ చందానగర్ ‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.  అవంతిని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హేమంత్ దారుణ హత్యకు గురయ్యాడు. కులం వేరు కావడం వల్లే.. హేమంత్‌ ను తన తండ్రి లక్ష్మారెడ్డి కిడ్నాప్‌ చేయించి హత్యచేసినట్టు అవంతి ఆరోపిస్తోంది. నిన్న మధ్యాహ్నం తమ ఇద్దరినీ కిరాయి గూండాలు కారులో కిడ్నాప్ చేశారని అవంతి చెప్తుంది. ఆ తర్వాతను అవంతి తప్పించుకుని డయల్‌ 100 కి సమాచారం ఇచ్చినా గచ్చిబౌలి పోలీసులు పట్టించుకోలేదని చెబుతోంది.హేమంత్‌ను వెంటాడి కారులోకి ఎక్కించారని అవంతి చెబుతోంది. తన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ నాన్నకు రాసిచ్చినట్టు అవంతి చెబుతోంది. ఈ ఘటనలో హేమంత్‌ రెడ్డి డెడ్‌ బాడీని.. సంగారెడ్డి వద్ద పోలీసులు గుర్తించారు. అటు పోలీసులు మాత్రం... కేసు దర్యాప్తులో ఎలాంటి అలసత్వం వహించలేదని చెబుతున్నారు. అవంతి ఫిర్యాదు చేసే సమయానికే హత్య జరిగిపోయిందని తెలిపారు.

 ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటివరకు మొత్తం  12 మందిని అరెస్ట్ చేశారు. అవంతి బంధువులు మొత్తం ఈ హత్యలో ఇన్వాల్వ్ అయ్యారని, మహిళలు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం .. గురువారం సాయంత్రం 4 గంటలకు హేమంత్, అవంతిలను దుండగులు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత హేమంత్ తండ్రి 100 కు డయల్ చేసి సమాచారం ఇచ్చారని, పెట్రోలింగ్ వాహనం వెళ్లేసరికి అవంతి ఆ ప్రదేశంలో లేదని, నిన్న  సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అవంతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందని, ఆ సమయానికే హేమంత్ ను చంపేశారని పోలీసులు వివరించారు. హత్యలో అవంతి తండ్రి లక్ష్మారెడ్డితో పాటు ఇతర బంధువులది ప్రధాన పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
Tags:    

Similar News